Chia Seeds: చియా సీడ్స్ రోజూ తింటున్నారా..? నెల రోజుల్లో మీ శరీరంలో జరిగేది ఇదే..!
చియా సీడ్స్‌లో ఉండే కాల్షియం, బోరాన్ ఎముకల ధృడత్వానికి తోడ్పడుతుంది. రోజుకు ఒకటిన్నర టీ స్పూనుల చియా సీడ్స్ అరకప్పు నీటిలో రెండు గంటల పాటు నానబెట్టి ఆహారంతో పాటు తీసుకుంటే మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. పాలు, బియ్యం మిశ్రమం పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. పాలతో అన్నం వండుకుని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి వివిధ ప్రయోజనాలు లభిస్తాయి.

చియా సీడ్స్.. ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పెందిన బెస్ట్ వెయిట్ లాస్ ఆహారం. చిన్నగా నల్లని రంగులో ఉండే చియా సీడ్స్..పోషకాల ఖజానాగా చెబుతారు. వీటిని ఆహారంలో భాగంగా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చియా సీడ్స్‌లో శరీరానికి రోజువారీ కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. ఛియా సీడ్స్‌లో విటిమన్ ఏ,బి,ఇ, డితో పాటు నియాసన్, థియామిన్, కాల్షియం, పొటాసియం, ఫాస్పరస్, కాపర్, జింక్ మాంగనీస్, ఐరన్, అయోడిన్, సల్ఫర్ ఉంటాయి. చియా సీడ్స్‌లో నాచురల్ ఫెనొలిక్ అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. చియా సీడ్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ వ్యాధుల నుంచి చర్మాన్ని మరమ్మత్తు చేసి ముడతలు పడకుండా కాపాడుతుంది.
చియా సీడ్స్ ఆహారంలో తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. చియా సీడ్స్‌లో ఉండే ఫైబర్ త్వరగా ఆకలి తీరేలా చేస్తాయి. చియా సీడ్స్ వల్ల శరీర బరువు క్రమంగా తగ్గించుకోడానికి దోహదం చేస్తాయి. చియా సీడ్స్‌లో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి సహాయకారులైన బాక్టీరియాకు ఆహారంగా పనిచేసి జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. చియా సీడ్స్‌లో లినో లెనిక్ యాసిడ్ అనే ఫాటీ యాసిడ్ కొవ్వులో మాత్రమే కరిగే గుణం ఉన్న ఏ,డి,ఇ,కె విటమిన్లను శరీరం సక్రమంగా వినియోగించుకునేలా చేస్తుంది.
చియా సీడ్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పరిమాణం సొలమన్ చేపల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ కంటే అధికంగా ఉంటుంది. చియా సీడ్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో కణాల వాపును, అధిక రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. చియా సీడ్స్‌లో ఉండే ఆల్ఫాలిపోయిక్ యాసిడ్ స్త్రీలలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్, సెర్వైకల్ క్యాన్సర్‌లను నివారించడానికి ఉపకరిస్తాయి. చియా సీడ్స్ శరీరంలో జీవ క్రియ పెంచడం ద్వారా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించి అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
చియా సీడ్స్‌లో ఉండే కాల్షియం, బోరాన్ ఎముకల ధృడత్వానికి తోడ్పడుతుంది. రోజుకు ఒకటిన్నర టీ స్పూనుల చియా సీడ్స్ అరకప్పు నీటిలో రెండు గంటల పాటు నానబెట్టి ఆహారంతో పాటు తీసుకుంటే మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. పాలు, బియ్యం మిశ్రమం పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. పాలతో అన్నం వండుకుని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి వివిధ ప్రయోజనాలు లభిస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








