జుట్టు అతిగా రాలిపోతుందా? అయితే ఈ నూనెతో చెక్ పెట్టండి!
చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా అతిగా జుట్టు రాలడం, పొరిబారినట్లు ఉండం, జుట్టు పలపబడి పోవడం వంటి అనేక సమస్యలు ఎదురు అవుతుంటాయి. అయితే ఈ జుట్టు సమస్యల నుంచి బయటపడటానికి చాలా మంది బాదం నూనె రాస్తారు. కాగా, బాదం నూనెను రాత్రి సమయంలో జుట్టుకు రాసుకోవడం వలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో చూద్దాం.
Updated on: Aug 09, 2025 | 8:04 AM

అమ్మాయిలకు జుట్టు అంటే చాలా ఇష్టం ఉంటది. అందుకే వారు కాస్త జుట్టు రాలడం ప్రారంభమైతే చాలు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అసలు ఎందుకు ఇంతలా హెయిర్ ఫాల్ అవుతుందని బెంగపడిపోయి, డిఫరెంట్ నూనెలను వాడుతుంటారు. ఇందులో ప్రధానమైనది బాదం నూనె. అయితే దీనిని రాత్రి సమయంలో హెయిర్‌కి అప్లై చేస్తే నిజంగానే జుట్టు దృఢంగా తయారు అవుతుందా అంటే? అవును అనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బాదం నూనె జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగ పడుతుందంట.

బాదం నూనెలో విటమిన్ ఇ, ఒమేగా 9 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇవన్నీ జుట్టును బలోపేతం చేసి, జుట్టును కుదుళ్ల నుంచి రక్షిస్తాయంట.అందుకే తప్పనిసరిగా బాదం నూనెను జుట్టుకు పెట్టుకోవాలని చెబుతున్నారు నిపుణులు. దీనిని ప్రతి రోజూ లేదా వారంలో రెండు మూడు సార్లైన జుట్టుకు అప్లై చేయడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏవి అంటే?

బాదం నూనెలోని పోషకాలు జుట్టు పెరుగుదలను పెంచడమే కాకుండా,జుట్టు కుదుళ్లను పోషించి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి, ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ప్రతి రోజూ బాదం నూనె తలకు రాయడం వలన ఇది తలపై చర్మం వాపును తగ్గిస్తుంది. తలలోని దురద, వంటి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే జుట్టు చీలిపోకుండా ఉండటమే కాకుండా మందంగా తయారయ్యి, ఆరోగ్యంగా ఉంటుంది.

బాదం నూనె జుట్టు కుదుళ్లను మృదువుగా చేసి, వాటిని మెరిసేలా చేస్తుంది. అలాగే బాదం నూనెను కాస్త వేడి చేసి జుట్టుకు అప్లై చేయడం వలన ఇది జుట్టును మెరిసేలా చేసి, పొడిబారడాన్ని తగ్గిస్తుంది. అందుకే జుట్టు సమస్యలతో బాధపడే వారు తప్పక బాదం నూనె వాడటం మంచిదంట.

అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. రాత్రి సమయంలో బాదం నూనె తలకు రాయడం మంచిదేనో, కాదో అని? అయితే దీనిపై నిపుణులు మాట్లాడుతూ..ఇది చాలా వరకు మంచిది. కానీ రాత్రి సమయంలో జుట్టుకు నూనె రాసే క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంట. ఆయిల్ ను నెత్తిమీద సున్నితంగా అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత జుట్టును వదిలివేయకుండా, జడను కట్టి పెట్టుకొని ఉండాలంట.



