Motivation: నిరాశతో ఉన్నారా.. స్వామి వివేకానంద కోట్స్‌ చదవండి, ఆశలు చిగురిస్తాయి

|

May 11, 2024 | 5:21 PM

ప్రతీ మనిషికి ఏదో ఒక సమయంలో నిరాశ కలగడం సర్వసాధారణమైన విషయం. అనుకున్నది సాధించలేకపోవడమో, కోరుకున్నది దక్కకపోవడం. అన్ని తమకు వ్యతిరేకంగా జరుగుతున్నాయన్న బాధో కారణం ఏదైనా జీవితంలో మనలో చాలా మంది ఇలా నిరాశకు గురయ్యే అంటాం. అయితే ఎన్నో ఏళ్ల క్రితమే స్వామి వివేకానంద యువతలో...

Motivation: నిరాశతో ఉన్నారా.. స్వామి వివేకానంద కోట్స్‌ చదవండి, ఆశలు చిగురిస్తాయి
Motivation Quotes
Follow us on

ప్రతీ మనిషికి ఏదో ఒక సమయంలో నిరాశ కలగడం సర్వసాధారణమైన విషయం. అనుకున్నది సాధించలేకపోవడమో, కోరుకున్నది దక్కకపోవడం. అన్ని తమకు వ్యతిరేకంగా జరుగుతున్నాయన్న బాధో కారణం ఏదైనా జీవితంలో మనలో చాలా మంది ఇలా నిరాశకు గురయ్యే అంటాం. అయితే ఎన్నో ఏళ్ల క్రితమే స్వామి వివేకానంద యువతలో ఉత్సాహాన్ని నింపేందుకు మంచి సూక్తులు తెలిపారు. నిరాశతో ఉన్న సమయంలో వీటిని చదివితో జీవితంపై ఆశలు చిగురిస్తాయి, సాధించాలనే కసి పెరుగుతుంది. అలాంటి కొన్ని బెస్ట్ మోటివేషనల్ కోట్స్‌ ఇప్పుడు చూద్దాం..

* పిరికితనం మనిషిని నిర్వీర్యుడ్ని చేస్తుంది, ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోవాలి.

* కొన్ని సందర్భాల్లో మనం త్వరగా సక్సెస్‌ రావాలని కోరుకుంటాం. కానీ విజయానికి ఎంతో ఓర్పు ఉండాలి. అందుకే స్వామి వివేకానంద ఇందుకు సంబంధించి ఓ మంచి కొటేషన్‌ చెప్పారు. అదే.. ‘ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది’.

* సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు.

* నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది. కష్టపడి పనిచేసే సాధించలేనిది ఏది లేదని దీని అర్థః.

* రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. మీతో మీరు మాట్లాడుకుంటేనే కదా మీరెంటో మీకు తెలిసేది.

* కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు.. పడినా లేస్తున్నందుకు. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వైఫల్యాలు ఎదురైనా మళ్లీ తిరిగి పోరాటం చేయాలి.

* జీవితంలో ధనం కోల్పేతో కొంత కోల్పోయినట్లు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే.

* ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరుగుతాయి.

* చావు బతుకులు ఎక్కడో లేవు.. ధైర్యంలోనే బతుకు ఉంది. భయంలోనే చావు ఉంది.