AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oil Pulling: ఆయిల్ పుల్లింగ్‌తో అదిరే లాభాలు.. ఈ సమస్యలన్నీ దూరం..

మన నోటిలో ఎన్నో సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలు ఉంటాయి. అయితే వీటిలో కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడువు ఉంటాయి. ఈ చెడు క్రిముల వల్లే పంటి నొప్పి, చిగుళ్లకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఈ సమస్యను దూరం చేయడంలో ఆయిల్‌ పుల్లింగ్ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చిగుళ్లలలో సమస్యలు వచ్చినా...

Oil Pulling: ఆయిల్ పుల్లింగ్‌తో అదిరే లాభాలు.. ఈ సమస్యలన్నీ దూరం..
Oil Pulling
Narender Vaitla
|

Updated on: Oct 08, 2024 | 4:36 PM

Share

నోటి ఆరోగ్యం బాగుంటేనే శరీరం ఆరోగ్యం బాగుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అందుకే మౌత్‌వాషను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే మౌత్ వాష్‌లలో ఉండే గాఢత నోటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే ఇంట్లోనే కొన్ని సహజ పద్ధతుల్లో ఆయిల్‌ పుల్లింగ్ చేస్తే ఎన్నో లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆయిల్‌ పుల్లింగ్‌ అంటే ఏంటి.? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

మన నోటిలో ఎన్నో సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలు ఉంటాయి. అయితే వీటిలో కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడువు ఉంటాయి. ఈ చెడు క్రిముల వల్లే పంటి నొప్పి, చిగుళ్లకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఈ సమస్యను దూరం చేయడంలో ఆయిల్‌ పుల్లింగ్ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చిగుళ్లలలో సమస్యలు వచ్చినా, నోటి నుంచి దుర్వాసస వస్తున్నా.. ఆయిల్‌ పుల్లింగ్ చేయాలని సూచిస్తున్నారు.

ప్రతీ రోజూ ఆయిల్‌ పుల్లింగ్‌ చేయడం వల్ల దంతాల మధ్య చిక్కుకున్న పదార్థాల అవశేషాలు తొలగిపోతాయి. దీంతో పళ్లు పుచ్చిపోకుండా ఉంటాయి. అలాగే నోటి దుర్వాసన సమస్య దూరమవుతుంది. ఉదయాన్నే బ్రష్‌ చేసుకున్న తర్వాత ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల దంతాలపై రంద్రాళుల ఏర్పడడానికి కారణమయ్యే బ్యాక్టీరియా నశిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం రావడం వంటి సమస్యలు సైతం ఆయిల్‌ పుల్లింగ్‌తో చెక్‌ పెట్టొచ్చు.

ఆయిల్ పుల్లింగ్ ఎలా చేయాలంటే..

ఆయిల్‌ పుల్లింగ్‌కు ఆలివ్‌, కొబ్బరి, నువ్వుల నూనెలను ఉపయోగించాలని నిపుణులు చబుతున్నారు. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్‌ నూనెను నోట్లోవేసుకొని బాగా పుకిలించాలి. కొంత నీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నోట్లోన్ని మూలలకు ఆయిల్ వెళ్లేలా చూసుకోవాలి. అయితే ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్‌ మింగకూడదు. కొంతసేపు పుకిలించిన తర్వాత నూనె ఉమ్మివేయాలి. ఇలా ఆహారం తీసుకున్న తర్వాత చేస్తే పంటి సంబంధిత సమస్యలు దరిచేరవు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..