Hair Care Tips : మీరు తెలియకుండా చేసే ఈ 5 తప్పులే మీ జుట్టు రాలడానికి కారణం..! ఏంటో తెలుసుకోండి..

|

Jul 17, 2021 | 3:51 PM

Hair Care Tips : వర్షాకాలంలో జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య. కానీ కొంతమందికి ఎప్పుడూ రాలుతూ ఉంటుంది. మీరు ఎన్ని షాంపూలు

Hair Care Tips : మీరు తెలియకుండా చేసే ఈ 5 తప్పులే మీ జుట్టు రాలడానికి కారణం..! ఏంటో తెలుసుకోండి..
Hair Fall
Follow us on

Hair Care Tips : వర్షాకాలంలో జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య. కానీ కొంతమందికి ఎప్పుడూ రాలుతూ ఉంటుంది. మీరు ఎన్ని షాంపూలు ప్రయత్నించినా.. ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా జుట్టు రాలడం ఆగదు. మీ విషయంలో కూడా ఇదే జరిగితే మీరు ఈ పరిస్థితిని కొంచెం విశ్లేషించాలి ఎందుకంటే చాలాసార్లు మీకు తెలియకుండానే ఇలాంటి తప్పులు చేస్తారు. దీనివల్ల జుట్టు రాలడం మొదలవుతుంది.

1. జుట్టు రాలడం వల్ల హెయిర్ పలుచన అవుతుంది. దీంతో అందం, లుక్ గురించి బాధపడుతుంటాం. ఎన్నో ప్రయోగాలు చేసి హెయిర్‌ స్టైల్‌ని బాగా చూపించడానికి ప్రయత్నిస్తాం. అటువంటి పరిస్థితిలో చాలా సార్లు అనేక రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తాం. వీటివల్ల దుష్ప్రభావాలు ఉంటాయి. దీంత జుట్టు రాలే సమస్య పెరుగుతుంది.

2. మీరు జుట్టుకు నూనె రాయకుండా రోజూ షాంపూ చేసినా జుట్టు రాలడం జరుగుతుంది. నిజానికి షాంపూ చేయడం ద్వారా జుట్టు తేమ పోతుంది. అందువల్ల షాంపూ వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే చేయాలి. మీరు షాంపూ చేస్తే మాత్రం తలకు నూనె పట్టించిన తర్వాత మాత్రమే చేయండి.

3. బ్లో-డ్రైయర్స్ లేదా ఇతర హీట్ స్టైలింగ్ ఉత్పత్తులు కూడా జుట్టును పొడిబారేలా చేస్తాయి. మీరు వాటిని తరచుగా ఉపయోగిస్తుంటే మీ జుట్టు ఖచ్చితంగా రాలడం మొదలవుతుంది. జుట్టు నాణ్యత కూడా క్షీణిస్తుంది.

4. మీరు తరచుగా బయటి ఆహారాన్ని తినడం, ఎక్కువ జిడ్డుగల, ఫాస్ట్ ఫుడ్, ఆహారాన్ని తింటే మీ శరీరానికి పోషకాలు అందవు. దీంతో మీ జుట్టు బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. అంతేకాదు తెల్లగా మారుతుంది. అందుకే ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. ఆకుపచ్చ కూరగాయలు, సలాడ్, పెరుగు, మజ్జిగ, తాజా పండ్లు, మొలకలు మొదలైనవి మీ ఆహారంలో చేర్చండి.

5. తడి జుట్టు దువ్వడం, లేదా బ్రష్ చేయడం వల్ల వాటి మూలాలు బలహీనపడతాయి. జుట్టు రాలడానికి దారితీస్తుంది. మీరు కూడా ఈ తప్పు చేస్తే మీ జుట్టు రాలడానికి ఇది కారణం కావచ్చు.

6. ప్రతి ఒక్కరూ సాధారణంగా చేసే ఒక తప్పు ఉంది. ప్రజలు తరచూ తడి జుట్టును తువ్వాలతో గట్టిగా తుడుస్తారు. ఇది జుట్టుకు నష్టం కలిగిస్తుంది. జుట్టు మూలాల నుంచి బలహీనపడుతుంది. తడి జుట్టు మీద టవల్ ఉపయోగించకూడదు.

YV Subbareddy: తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచాడు.. రెండోసారి టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమాకం!

Manish Malhotra: మెగా ఫోన్ పట్టనున్న ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్.. కరణ్ జోహార్ నిర్మాణంలో..

Country Club: హైదరాబాద్ కంట్రీ క్లబ్‌ పబ్‌లో‌ లీలలు అన్నీ.. ఇన్నీ.. కావట.! అంతా మసక మసక చీకటేనట.!