Most Effective Exercise: వ్యాయామానికి సమయం దొరకడం లేదా..? రోజూ ఇలా రెండు నిమిషాలు చేస్తే చాలు..!!

|

Aug 04, 2021 | 6:01 PM

ఉదయం లేవగానే.. చాలా మంది.. వ్యాయామం చేయనిదే.. ఏ పనీ చేయరు. అది వారి జీవితంలో.. ఒక భాగమైపోతుంది. యోగా.. జాగింగ్, వాకింగ్...

Most Effective Exercise: వ్యాయామానికి సమయం దొరకడం లేదా..? రోజూ ఇలా రెండు నిమిషాలు చేస్తే చాలు..!!
Body Workout
Follow us on

ఉదయం లేవగానే.. చాలా మంది.. వ్యాయామం చేయనిదే.. ఏ పనీ చేయరు. అది వారి జీవితంలో.. ఒక భాగమైపోతుంది.  జాగింగ్, వాకింగ్, వర్కవుట్ ఇలా ఏదో ఒక రకంగా కేలరీలు చేస్తూంటారు. కానీ.. ఒక్కోసారి.. టైం కుదరకనో.. మరేదేమైనా కారణంతోనో.. వ్యాయామం స్కిప్‌ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ చిట్కా పాటిస్తే సరిపోతుందని.. నిపుణులు చెప్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మేలు చేసే ఎక్సర్‌ సైజ్‌లు ఏమైనా ఉన్నాయా అంటే.. అందులో పుషప్స్ ముందు వరుసలో ఉంటాయనేది నిపుణుల సలహా. సరైన పద్ధతిలో పుషప్స్ చేస్తే.. శరీరానికి పూర్తిస్థాయి వ్యాయామం చేసినంత మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు. పాదాల నుంచి.. తల వరకు మొత్తం శరీరంలోని ప్రతీ అవయవాన్నీ.. ప్రభావితం చేసే శక్తి పుషప్స్‌‌కి ఉందని ఓ అధ్యయనంలో తేలింది. మగవారు, ఆడువారు.. ఎవరైనా సరే ప్రతీ రోజూ.. రెండు నిమిషాల పాటు.. పుషప్స్‌ చేస్తే చాలు.. ఆరోగ్యానికి ఆరోగ్యం కలిసివస్తుంది.. టైంకి టైం సేవ్ అవుతుంది.

Pushups

రోజూ.. మగవారు 40 పుషప్స్, స్త్రీలు 20 పుషప్స్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయని.. జిమ్ ట్రైనర్స్ చెబుతున్నారు. నిత్యం వ్యాయామం చేసే వారితో.. వీరిని పోలిస్తే.. రెండు ఫలితాలు ఇంచుమించు ఒకే విధంగా ఉన్నట్టు వారు చెప్పుకొచ్చారు. పుషప్స్ చేయడం వల్ల చేతులు, కాళ్లు, నడుం కింద.. వెనుక భాగాల్లో కండరాలు ధృడంగా తయారవుతాయని.. అలాగే.. మంచి శరీరసౌష్టవం ఏర్పడుతుందనేది నిపుణుల సలహా. మీరు ఎప్పుడైనా వ్యాయామం స్కిప్ చేయాల్సి వస్తే..  ఓ 5 నిమిషాలు పుషప్స్ తీయడం మాత్రం మర్చిపోకండి.

Also Read: మాయదారి వడ్డీ డబ్బు.. పుస్తెల తాళి ఇచ్చినా, పతి దేవుడ్ని కాపాడుకోలేకపోయింది

 ఏపీలోని ఆ ప్రాంతాలలో ఉధృతంగా కరోనా వ్యాప్తి.. కర్ఫ్యూ విధింపు