క్షమాపణ.. చిన్న పదమే అయినా.. ఎదుటి వారిని శాంతిపజేసే మంత్రం ఇదని చెప్పవచ్చు. అలా అని ఈ క్షమాపణ.. అన్నింటికి పనికి రాదు. మన వల్ల అనుకోకుండా జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పడం మంచి విషయమే. చిన్న చిన్న తప్పులకు కూడా క్షమాపణ చెప్పవచ్చు. ముఖ్యంగా పిల్లల్లో ఈ బంధాన్ని పెంపొందించాలి. ఈ చిన్న పదం వల్ల ఎదుటి వారితో సంబంధాలు ఏర్పరచుకోవచ్చు. పిల్లలకు క్షమాపణ చెప్పడం చిన్నప్పటి నుంచే నేర్పించాలి. దీని వల్ల వారిలో క్రమశిక్షణ, ఎదుటి వారి పట్ల ఎలా మెలగాలన్న విషయం అర్థమవుతుంది. ఈ సింపుల్ టిప్స్ ను పాటిస్తే.. పిల్లల చేత సారీ ఎలా చెప్పించాలో ఈజీ అవుతుంది. కానీ ఈ క్షమాపణ అన్నింటికీ పనికి రాదన్న విషయాన్ని కూడా వారు గ్రహించేలా వారికి మెలకువలు నేర్పించాలి.
ముందు మీరు చెప్పాలి:
పిల్లలకు ఏదైనా, ఏమైనా తల్లిదండ్రలను చూసే నేర్చుకుంటారు. ఇంట్లోని పరిస్థితులే వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వారు ఎప్పుడూ మనల్ని గమనిస్తూ.. అనుకరిస్తూ ఉంటారు. కాబట్టి క్షమాపణ చెప్పడం అనేది ఎప్పుడూ మన నుంచే మొదలవ్వాలి. మనం చిన్న వాటికి ఇంట్లో చెప్తూ ఉంటే వారు కూడా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు.
పిల్లల సమస్యల్ని అర్థం చేసుకోవాలి:
పిల్లల్ని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండాలి. స్కూల్లో ఎలా ఉంటున్నారు. బయట ఎలా ఉంటారు. వారు ఏమాన ఇబ్బందులకు ఫీల్ అవుతున్నారా.. మనతో చెప్పుకోలేక పోతున్నారా అనే విషయాల్ని పేరెంట్స్ గా మనమే అర్థం చేసుకుంటూ ఉండాలి.
క్షమాపణ అర్థాన్ని వివరించాలి:
మీ పిల్లలకు క్షమాపణ అర్థాన్ని వివరించాలి. క్షమాపణను ఎప్పుడెప్పుడు వాడాలో సరిగ్గా వివరిస్తే వారికి అర్థం అవుతుంది. ఒకరిని క్షమించడం అనేది కోపం, ఆగ్రహం, ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికను విడిచి పెట్టడమే. అంతే కాకుండా క్షమాపణ వలన తనలో తాను శాంతిని వెతుక్కోవచ్చని చెప్పవచ్చు.
పుస్తకాలను చదివి వినిపించండి:
క్షమాపణ ప్రాముఖ్యత కలిగిన పుస్తకాలను, స్టోరీలను చూపిస్తూ, వినిపిస్తూ ఉంటే వారికి ఇంకొంత తొందరగా అర్థం అవుతుంది. దీంతో వారిలో సానుకూల ప్రభావం ఏర్పడుతుంది. జీవితాల్లో ఆచరించేలా వారిని ఈ పుస్తకాలు, స్టోరీలు ప్రేరేపిస్తాయి.
కమ్యునికేషన్ ను ప్రోత్సహించండి:
మీ పిల్లలకు వారి భావాలను, ఆందోళలనను వ్యక్త పరచడాన్ని నేర్పించాలి. అంతే కాకుండా వారితో ఆరోగ్యకరమైన సంభాషణను పెంపొందించుకోవాలి. దీంతో వారికి అవగాహన ద్వారా విభేదాలను పరిష్కరించడానికి పునాది వేస్తారు.
సమస్య పరిష్కార నైపుణ్యాలను నేర్పించాలి:
తమ సమస్యలను ఎలా పరిష్కారం చేసుకోవాలో పిల్లలకు మార్గ నిర్దేశం చేయాలి. ఆలోచనాత్మక పరిష్కారాలను, రాజీలను ప్రోత్సహించడం వల్ల వారిలో నైపుణ్యం అనేది పెరుగుతుంది. అలాగే పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులకు వారై కోపం తెచ్చుకోకూడదు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.