Summer Tips: ఇంటి చల్లదనం కోసం ఈ సింపుల్ టిప్స్ పాటించండి.. విద్యుత్ ఆదా.. చల్లదనానికి చల్లదనం..
Summer Tips: భారతదేశంలోని(Bharath) అనేక ప్రాంతాల్లో భానుడు భగభగమండిస్తున్నాడు. వేడి గాలులు (Heat Waves) కొనసాగుతున్నాయి. మరోవైపు తీవ్ర విద్యుత్ సంక్షోభం ( power crisis )..
Summer Tips: భారతదేశంలోని(Bharath) అనేక ప్రాంతాల్లో భానుడు భగభగమండిస్తున్నాడు. వేడి గాలులు (Heat Waves) కొనసాగుతున్నాయి. మరోవైపు తీవ్ర విద్యుత్ సంక్షోభం ( power crisis ) తలెత్తుతుంది. ఎండ వేడిమికి ప్రజల ఆరోగ్యం క్షీణిస్తోంది.. తాజా నివేదికల ప్రకారం, దేశంలోని కొన్ని ప్రాంతాలలో వేడి అధికమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ మండుతున్న ఎండల నుంచి, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి చాలా ప్రయత్నిస్తారు. ఎక్కువ మంది తమ ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి కూలర్‌లు , ACల సహాయం తీసుకుంటారు. అయితే ఈ మెషీన్‌లను ఎక్కువసేపు ఇలా ఏసీ , కూలర్ చల్లదనంలో ఉండడం హానికరమని అంటున్నారు. వీటిని వాడడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా.. కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తుంది. కనుక ఇంటిని చల్లబరుచుకోవడానికి AC , కూలర్ లకు బదులు ఇతర పద్దతులను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంటిని చల్లగా ఉంచే కొన్ని సింపుల్ టిప్స్ ను ఈరోజు మీకు తెలియజేస్తున్నాం..
- గదికి బల్బు మార్చండి: కొన్నిసార్లు ఇంట్లో అమర్చిన బల్బులు లేదా ప్రకాశవంతమైన లైట్లు కూడా గది వేడిని పెంచేలా చేస్తాయి. మీ ఇంట్లో బల్బులు లేదా లైట్లు వేడిని పెంచుతున్నాయనే ఫీలింగ్ కలిగితే.. వెంటనే వాటి బదులు మార్కెట్ లో అందుబాటులో ఉన్న LED లైట్లను అమర్చుకోండి. ఇవి ఎక్కువ కాంతిని, తక్కువ వేడిని ఇస్తాయి.
- ఫ్రిజ్ కోసం గది: ఇంట్లో స్థలం తక్కువగా ఉండటం వల్ల కొంతమంది ఫ్రిజ్ కోసం స్పెషల్ గదిని ఏర్పాటు చేయరు. దీంతో వేసవి సీజన్‌లో ఉండే వేడి తో పాటు ఫ్రిజ్ నుండి వెలువడే వేడి.. ఇల్లు మరింత వేడిగా ఉండేలా చేస్తుంది. కనుక ఫ్రిడ్జ్ ను తక్కువ ఉపయోగించే గదిలో ఏర్పాటు చేసుకోవడం వలన వేడిని తగ్గించుకోవచ్చు.
- మీరు దేశీ పద్ధతిలో గదిని చల్లగా ఉంచాలనుకుంటే.. చల్లదనం కోసం శీతలీకరణ షీట్ ను ఉపయోగించండి. ఈ రోజుల్లో మార్కెట్‌లో రకరకాల షీట్లు సులువుగా దొరుకుతున్నాయి. ధర కూడా అందుబాటులో ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఇలాంటి షీట్ కొని ఇంటి తలుపులకు వేలాడదీయండి. ఇవి ఇంటిని చల్లగా ఉండేలా చేస్తాయి. అయితే ఈ చాపలు తేమగా ఉండేలా అప్పుడప్పుడు కొంచెం నీరు చల్లుతూ ఉండండి.. ( Source )