టీ తాగుతున్నారా..? ఆగండి.. నెల రోజుల పాటు ఇలా లవంగం నీళ్లు తాగి చూడండి..! శరీరంలో జరిగేది తెలిస్తే..
చాయ్.. టీ.. మనదేశంలో ఇది కేవలం ఒక పానీయం కాదు.. మన అందరి దినచర్యలో అతి ముఖ్యమైన భాగం. ఎందుకంటే.. చాలా మంది ఉదయం నిద్రలేవగానే..టీ తాగకపోతే వారికి తెల్లవారదు. నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాల సార్లు టీ తాగుతుంటారు. అలసట తీర్చుకోవడం కోసం, నిద్రనుంచి మేల్కోలుపు కోసం అలవాటుగా మారిన టీ ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. కానీ, దాని స్థానంలో నెల రోజుల పాటు ప్రతిరోజూ లవంగం నీరు తాగి చూడండి.. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి వంటగదిలో సాధారణంగా ఉపయోగించే మసాలా దినుసు అయిన లవంగాలు, ఆహారానికి రుచిని అందించడమే కాకుండా, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక నెల పాటు ప్రతిరోజూ లవంగం నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి. లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
లవంగం నీటిని ఎలా తయారు చేయాలి?
రెండు నుండి మూడు లవంగాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సులభమైన పద్ధతి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
లవంగం నీటి ప్రయోజనాలు:
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: లవంగాల నీరు జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. గ్యాస్, ఆమ్లత్వం, అజీర్ణం, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: లవంగాలలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయల్ లక్షణాలు శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. ఇది జలుబు, ఫ్లూ, శ్వాసకోశ వ్యాధులు, వైరల్ వ్యాధుల నుండి రక్షిస్తుంది. అలాగే శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
నోటి ఆరోగ్యం: లవంగం నీటిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు దుర్వాసన, దంత సమస్యలు, చిగుళ్ల ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఇది చిగుళ్ళను బలపరుస్తుంది. శ్వాసను తాజాగా ఉంచుతుంది. నోటి పరిశుభ్రతను కాపాడుతుంది.
ఆర్థరైటిస్ లో ఉపశమనం: లవంగం నీటిలోని యూజినాల్ శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. తేలికపాటి ఆర్థరైటిస్‌తో బాధపడేవారిలో కీళ్ల మరియు కండరాల నొప్పిని తగ్గిస్తుంది. ఇది శరీరంలో మంటను నియంత్రించడంలో సహాయపడుతుంది.
కాలేయం, క్యాన్సర్ రక్షణ: లవంగం నీరు కాలేయ పనితీరును మెరుగుపరుస్తుందని, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుండి రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉందని నిపుణులు తెలిపారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








