Summer Plant Care: వేసవిలో ఇండోర్ మొక్కలను ఈ సింపుల్ టిప్స్ తో సంరక్షించండి

|

May 25, 2024 | 6:48 PM

ఇంటి లోపల పెంచిన మొక్కలు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఎండిపోతున్నా ఈ రోజు చెబుతున్న చిట్కాలను ఆచరించవచ్చు. మండే వేడిలో మీ ఇంటిని చల్లగా ఉంచడానికి చెట్లను నాటాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే, వాటి సంరక్షణ కోసం ఇక్కడ ఇచ్చిన చిట్కాలను పాటించడం వలన మొక్కలు  పచ్చగా ఉంటాయి. ఇండోర్ మొక్కలను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసుకుందాం.

Summer Plant Care: వేసవిలో ఇండోర్ మొక్కలను ఈ సింపుల్ టిప్స్ తో సంరక్షించండి
Summer Plant Care
Follow us on

ఇంటి లోపల మొక్కలను పెంచడం గది అందాన్ని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మంచిదని భావిస్తారు. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రత కారణంగా ఇండోర్ మొక్కలు కూడా ఎండిపోతాయి. అటువంటి పరిస్థితిలో మొక్కల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఇంట్లో ఉంచిన మొక్కలను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదని తరచుగా ప్రజలు భావిస్తారు. అవుట్‌డోర్‌ ప్లాంట్స్‌తో పాటు ఇండోర్‌ ప్లాంట్‌ల పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాలి. ఈ పచ్చటి మొక్కలు మీ ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇంటి లోపల పెంచిన మొక్కలు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఎండిపోతున్నా ఈ రోజు చెబుతున్న చిట్కాలను ఆచరించవచ్చు. మండే వేడిలో మీ ఇంటిని చల్లగా ఉంచడానికి చెట్లను నాటాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే, వాటి సంరక్షణ కోసం ఇక్కడ ఇచ్చిన చిట్కాలను పాటించడం వలన మొక్కలు  పచ్చగా ఉంటాయి. ఇండోర్ మొక్కలను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసుకుందాం.

మొక్కలకు ఎప్పుడు నీరు పెట్టాలంటే
కొంతమంది సమయం దొరికినప్పుడల్లా మొక్కలకు నీరు పోస్తారు. అయితే మొక్కలకు నీరు పెట్టడానికి సరైన సమయాన్ని నిర్ణయించుకోవాలి. ఎప్పుడు బడితే అప్పుడు సమయం దొరికినప్పుడల్లా మొక్కలకు నీరు పెట్టడం వల్ల మొక్కలకు హాని కలుగుతుంది. వేసవిలో మొక్కలకు నీరు పెట్టడానికి ఉత్తమ సమయం సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత. ఈ సమయంలో ఉష్ణోగ్రత తగ్గి.. కొద్దిగా చల్లగా ఉంటుంది. కనుక ఈ సమయంలో మాత్రమే మొక్కలకు నీరు పెట్టండి.

ఇవి కూడా చదవండి

ఒక్కసారిగా ఎక్కువ నీరు
కొంతమంది ఒక్కసారిగా కుండీలలో నీళ్లు నింపుతారు. ఇలా చేయడం వలన మొక్కలు కుళ్ళిపోవచ్చు లేదా పాడైపోతాయి. అందువల్ల ఈ సీజన్‌లో నేల తడిగా ఉండేలా చూస్తే చాలు. అంతేకాని ఒకేసారి మొక్కలకు ఎక్కువ నీరు పెట్టవద్దు. ఇలా చేయడం వలన మొక్కలకు హానికరం.

మట్టిపై శ్రద్ధ వహించండి
మొక్కలకు నీరు పెట్టడం పెట్టే విషయంలో మాత్రమే కాదు మొక్కలను పెంచే మట్టిపై కూడా శ్రద్ధ వహించాలి. మట్టిలో కీటకాలు లేదా చీమలు కనిపిస్తే.. ఆ మట్టి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మొక్కలకు ఆకుల పొడి నుంచి తయారు చేసిన ఎరువుని వేయడం వలన మట్టిలో తేమ ఉంటుంది. అవి ఎండిపోవు.

ఎరువులను ఉపయోగించవద్దు
వేసవిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కనుక.. మొక్కలకు ఎరువులు అవసరమైనప్పటికీ.. ఈ సీజన్‌లో మొక్కలకు ఎరువులు వేయవద్దు. ఈ సీజన్‌లో మొక్కలు ఉన్న నెల వేడిగా ఉంటుంది. కనుక ఎరువులు మొక్కలు వేస్తే మరింత వేడి ఎక్కువై మొక్కలకు మరింత హాని కలిగిస్తుంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..