Summer Health Tips: వేసవిలో ఎన్ని గుడ్లు తినవచ్చో తెలుసా..! నిపుణులు ఏమి చెబుతున్నారంటే..

|

May 18, 2024 | 7:00 PM

గుడ్లు తినడం గురించి ప్రజలలో చాలా అపోహలు ఉన్నాయి. వాటిలో ఒకటి వేసవిలో తినకూడదు. గుడ్డు స్వభావం వేడి చేస్తుందని.. అందుకే వేసవిలో దీన్ని తినడం వల్ల విరేచనాలు లేదా వాంతులు అవుతాయని నమ్ముతారు. ఈ కారణంతోనే ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా పక్కకు పెడతారు. శరీరంలోని అనేక పోషకాల లోపాన్ని తీర్చే గుడ్ల వినియోగాన్ని వదులుకునే బదులు.. వేసవిలో వాటిని ఎలా తినాలో తెలుసుకోవడం ముఖ్యం. వేసవిలో ఒక రోజులో ఎన్ని గుడ్లు తినవచ్చో పోషకాహార నిపుణులు చెప్పిన విషయాలు.. గుడ్లను ఏయే మార్గాల్లో తినడం మంచిదో తెలుసుకుందాం..

Summer Health Tips: వేసవిలో ఎన్ని గుడ్లు తినవచ్చో తెలుసా..! నిపుణులు ఏమి చెబుతున్నారంటే..
Summer Health Tips
Follow us on

కోడి గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్డు. ఆరోగ్యకరమైన సూపర్ ఫుడ్. ఎందుకంటే గుడ్డులో విటమిన్ బి12, బి6, బి5, విటమిన్ ఎ, విటమిన్ డితో పాటు ఫోలేట్, క్యాల్షియం సహా అనేక ఇతర పోషకాలు ఉన్నాయి. అందుకే ‘ఆదివారమైనా, సోమవారమైనా ప్రతిరోజూ గుడ్లు తినాలి’ అని అంటారు. అయితే వేసవిలో చాలా మంది గుద్దుకు దూరంగా ఉంటారు. గుడ్లు తినడం గురించి ప్రజలలో చాలా అపోహలు ఉన్నాయి. వాటిలో ఒకటి వేసవిలో తినకూడదు. గుడ్డు స్వభావం వేడి చేస్తుందని.. అందుకే వేసవిలో దీన్ని తినడం వల్ల విరేచనాలు లేదా వాంతులు అవుతాయని నమ్ముతారు. ఈ కారణంతోనే ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా పక్కకు పెడతారు. శరీరంలోని అనేక పోషకాల లోపాన్ని తీర్చే గుడ్ల వినియోగాన్ని వదులుకునే బదులు.. వేసవిలో వాటిని ఎలా తినాలో తెలుసుకోవడం ముఖ్యం. వేసవిలో ఒక రోజులో ఎన్ని గుడ్లు తినవచ్చో పోషకాహార నిపుణులు చెప్పిన విషయాలు.. గుడ్లను ఏయే మార్గాల్లో తినడం మంచిదో తెలుసుకుందాం..

నిపుణులు ఏమని చెప్పారంటే

గురుగ్రామ్ కు చెందిన నారాయణ హాస్పిటల్ సీనియర్ డైటీషియన్ మోహిని డోంగ్రే ఈ విషయంపై మాట్లాడుతూ గుడ్లు వేడి చేస్తాయని.. అందుకే చాలా మంది వేసవి కాలంలో గుడ్లు తినడం మానేస్తారు. ఎండాకాలంలో గుడ్లు తినాలా వద్దా లేక ఎండాకాలంలో గుడ్లు తింటే వాటి పరిమాణంలో ఎన్ని ఉంచాలి అనే అనేక ప్రశ్నలు చాలా మంది మదిలో ఉన్నాయి. వేసవిలో గుడ్లు ఎక్కువగా తింటే మన శరీరానికి ఏమైనా హాని జరుగుతుందా అంటే గుడ్లు చాలా ప్రోటీన్ కలిగి ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వేసవి కాలంలో ప్రతిరోజూ ఒకటి లేదా రెండు గుడ్లు తినవచ్చు.

ఇవి కూడా చదవండి

గుడ్లను ఉడకబెట్టడం లేదా ఆమ్లెట్ చేయడం ద్వారా తినవచ్చు అని నిపుణులు చెప్పారు. వేసవి కాలంలో ఎక్కువ గుడ్లు తినవద్దు రెండు లేదా మూడు గుడ్లు కంటే ఎక్కువ తింటే కడుపులో చికాకు కలుగుతుంది. ఎక్కువ గుడ్లు తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అనేక రకాల కడుపు సమస్యలను కలిగిస్తుంది. అయితే ఒకటి లేదా రెండు గుడ్లు మాత్రమే తింటే ఎవరికైనా ఎటువంటి సమస్య ఉండదు.

ఎటువంటి వారు వేసవిలో గుడ్లు తినకూడదంటే

ఎవరికైనా విరేచనాలు, వాంతులు లేదా కడుపు సంబంధిత సమస్యలు ఉంటే వారు ఖచ్చితంగా గుడ్లు తినే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం క్షీణిస్తే, మనం కిచడీ లేదా ఇతర తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ స్థితిలో గుడ్లు, మాంసం వంటి ఆహారాలు తింటే జీర్ణ వ్యవస్థ భారంగా మారుతుంది. అనారోగ్యంతో ఉన్నట్లయితే రోజూ గుడ్డు తినడం మంచిది కాదు. ఆమ్లెట్ లేదా ఇతర గుడ్డు వంటకాలకు బదులుగా ఉడికించిన గుడ్లను తినవచ్చు. అయితే గుడ్డులో పుసుపు సోన తినవద్దు. ఇది జీర్ణం కావడం కొంచెం కష్టం. బరువు తగ్గాలనుకునే వారు గుడ్డులోని పసుపు భాగాన్ని తినకూడదని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..