Health: ఎండలో బయటకు వెళ్లినప్పుడు తల తిరుగుతుందా? షాకింగ్ విషయాలు ఇప్పుడే తెలుసుకోండి..

|

Mar 16, 2023 | 5:01 PM

వేసవి కాలంలో ఎండలో బయటికి రావడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రత కారణంగా.. చెమట, వేడి, నీరసంగా ఉండటం, మూర్ఛ వంటి సమస్యలు మొదలవుతాయి.

Health: ఎండలో బయటకు వెళ్లినప్పుడు తల తిరుగుతుందా? షాకింగ్ విషయాలు ఇప్పుడే తెలుసుకోండి..
Summer
Follow us on

వేసవి కాలంలో ఎండలో బయటికి రావడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రత కారణంగా.. చెమట, వేడి, నీరసంగా ఉండటం, మూర్ఛ వంటి సమస్యలు మొదలవుతాయి. ఎక్కువసేపు ఎండలో ఉండడం వల్ల చాలా మంది స్పృహ తప్పి పడిపోతుంటారు. అందుకే ఎండలో ఎక్కువసేపు ఉండొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలా ఉండటం వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడి డీహైడ్రేషన్‌కు కారణం అవుతుంది. అంతేకాదు.. రక్తపోటు తగ్గుతుంది. ఫలితంగా కూడా తల తిరగడం వంటి సమస్యలు తెలెత్తుతాయి.

ఎండలో ఎందుకు తల తిరుగుతుంది..

సాధారణంగా వేసవి కాలంలో ఎక్కువగా చెమట పట్టేవారిలో కళ్లు తిరగడం సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో బయటకు వెళ్లినప్పుడు తలలో బరువుగా అనిపిస్తుంది. చెమటతో పాటు ఉప్పు, తేమ కూడా శరీరం నుండి బయటకు వెళ్లడం వల్ల ఇలా జరుగుతుంది. అంతే కాకుండా వేసవి కాలంలో హీట్ స్ట్రోక్ వల్ల తల తిరగడం సమస్య కూడా రావచ్చు.

ఎలా సేఫ్‌గా ఉండాలి..

1. ఎండలో బయటకు వెళ్లే వారు లేత రంగు దుస్తులను ధరించాలి. ముదురు రంగు దుస్తులు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. అలాగే వాతావరణ ఉష్ణోగ్రతలను గ్రహిస్తాయి.

ఇవి కూడా చదవండి

2. ఎండలో బయటకు వెళ్లే ముందు టోపీని ధరించాలి. సూర్యరశ్మిని తలకు, ముఖానికి తగలకుండా జాగ్రత్త వహించాలి.

3. ఎండలో బయటకు వెళ్ళినప్పుడు వెంట వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్లాలి. అప్పుడప్పుడు నీటిని తాగడం వల్ల హైడ్రేట్‌గా ఉండొచ్చు.

4. కళ్లు తిరిగినట్లుగా అనిపిస్తే ముందుగా చల్లని ప్రదేశంలో కాసేపు కూర్చోవాలి.

5. చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. వీలైతే వెంటనే నిమ్మరసం తాగాలి.

వేసవిలో ఇలా జాగ్రత్తగా ఉండాలి..

1. వేసవి కాలంలో మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. శరీరానికి అవసరమైన రోజూ 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. రోజంతా నీరు త్రాగేందుకు ప్రయత్నించాలి.

2. వేసవి కాలం సమస్యను అధిగమించడానికి ప్రతి రోజూ ఉదయం కొన్ని బాదం పప్పులను కూడా తినాలి. ఇందులో ఉండే విటమిన్ ఏ, బి, ఈ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇవి తలతిరగడం సమస్యను దూరం చేస్తాయి.

3. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు టీ లేదా కాఫీని తీసుకోవద్దు. సాధ్యమైనంత వరకు హెర్బల్ టీని తీసుకోవడం మంచిది.

4. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగడం కూడా చాలా మేలు చేస్తుంది. రోజూ ఉదయాన్నే తాజా పండ్ల రసాన్ని తాగాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..