వేసవిలో కొబ్బరి నీళ్లు తాగుతున్నారా..? ఎప్పుడు తాగితే మంచిదో తప్పక తెలుసుకోండి..!

కొబ్బరి నీళ్లు చాలా ఆరోగ్యకరమైనవి కూడా. కొవ్వు తక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉండదు. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇవి సహాయపడతాయి. వ్యాయామం తర్వాత లేదా వేసవిలో శరీరాన్ని చల్లబరచడానికి ఒక అద్భుతమైన పానీయం. అయితే, వేసవిలో కొబ్బరి ఎప్పుడు తాగితే మంచిదో తప్పక తెలుసుకోండి..!

వేసవిలో కొబ్బరి నీళ్లు తాగుతున్నారా..? ఎప్పుడు తాగితే మంచిదో తప్పక తెలుసుకోండి..!
అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన కొబ్బరి నీళ్ళు తాగడం కొంతమందికి హానికరం కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాంటి వారిలో ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదని చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని మూత్రపిండాలు ఫిల్టర్ చేయలేవు.

Updated on: May 12, 2025 | 9:54 PM

కొబ్బ‌రినీరు తాగ‌డం వ‌ల్ల శ‌రీరం హైడ్రేట్ అవుతుంది. కొబ్బరి నీళ్లు ఒక సహజసిద్ధమైన పానీయం. ఎలక్ట్రోలైట్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది, డీహైడ్రేషన్‌ను తగ్గిస్తుంది. కొబ్బరి నీళ్లు చాలా ఆరోగ్యకరమైనవి కూడా. కొవ్వు తక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉండదు. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇవి సహాయపడతాయి. వ్యాయామం తర్వాత లేదా వేసవిలో శరీరాన్ని చల్లబరచడానికి ఒక అద్భుతమైన పానీయం.

కొబ్బరి నీళ్లను సాంప్రదాయ వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. కొబ్బరి నీళ్లలో తక్కువ కేలరీలు ఉంటాయి. కొబ్బ‌రినీరు తాగ‌డం వ‌ల్ల శ‌రీరం హైడ్రేట్ అవుతుంది. రోజుకి రెండుసార్లు కొబ్బ‌రి నీరు తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త‌పోటు కంట్రోల్‌లో ఉంటుంది. కొబ్బ‌రినీళ్ల‌లో ఉండే పొటాషియం ర‌క్త‌పోటు నియంత్రిస్తుంది. కొబ్బ‌రినీరు తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. దీని వల్ల ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం తగ్గుతుంది. గుండెపోటు ప్ర‌మాదాలు త‌గ్గుతాయి. కొబ్బ‌రిలో చ‌క్కెర‌, కార్బోహైడ్రేట్లు త‌క్కువ‌గా ఉంటాయి. వీటి వల్ల బ‌రువు త‌గ్గేందుకు అవకాశం లభిస్తుంది.

వేస‌విలో కొబ్బ‌రినీళ్లు తాగ‌డం వ‌ల‌న జీవ‌క్రియ‌ను కూడా పెంపొందించుకోవ‌చ్చు. దీంతో శరీర అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. కొబ్బ‌రినీటిలో ఉండే పోటాషియం శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందిస్తుంది. దీంతో సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. వేసవి కాలంలో వడదెబ్బ, డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉండాలంటే కొబ్బరి నీరు త‌ప్ప‌కుండా తాగాలి.

ఇవి కూడా చదవండి

కొబ్బరి నీటిలో ఉండే పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరంలో శ‌క్తిని నింపి మిమ్మ‌ల్ని ఉత్సాహ‌వంతంగా మారుస్తాయి. కొబ్బరి నీరు మైక్రోబియల్, డీటాక్సిఫికేషన్ లక్షణాలు కలిగి ఉండ‌టం వ‌ల‌న ఇది శరీరంలోని టాక్సిన్స్ బ‌య‌ట‌కి పంపేందుకు స‌హాయ‌ప‌డుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..