Healthy Diet in Summer: వేసవిలో ఈ ఆహారాలు తీసుకుంటే తిప్పలు తప్పవు.. బీకేర్ ఫుల్!

|

May 12, 2024 | 5:18 PM

తొలకరి జల్లులు అప్పుడే ప్రారంభమయ్యాయి. కానీ వేడి ఉష్ణోగ్రతలు ఎప్పుడైనా అనారోగ్యానికి గురి చేయవచ్చు. అంతేకాకుండా ఈ సీజన్‌లో తలనొప్పి, వికారం, హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే వేసవిలో ఎక్కువగా డీహైడ్రేషన్, మలబద్ధకం, డయేరియా వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ శారీరక రుగ్మతల నుంచి మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉండటానికి ఆహార అలవాట్లపై దృష్టి పెట్టాలి. పోషకాహారం తినడం, శక్తినిచ్చే..

Healthy Diet in Summer: వేసవిలో ఈ ఆహారాలు తీసుకుంటే తిప్పలు తప్పవు.. బీకేర్ ఫుల్!
Healthy Diet In Summer
Follow us on

తొలకరి జల్లులు అప్పుడే ప్రారంభమయ్యాయి. కానీ వేడి ఉష్ణోగ్రతలు ఎప్పుడైనా అనారోగ్యానికి గురి చేయవచ్చు. అంతేకాకుండా ఈ సీజన్‌లో తలనొప్పి, వికారం, హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే వేసవిలో ఎక్కువగా డీహైడ్రేషన్, మలబద్ధకం, డయేరియా వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ శారీరక రుగ్మతల నుంచి మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉండటానికి ఆహార అలవాట్లపై దృష్టి పెట్టాలి. పోషకాహారం తినడం, శక్తినిచ్చే పానియలు త్రాగడం ద్వారా అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. అయితే రోజువారీ ఆహారంలో ఈ కింది పొరపాట్లను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు.

అడపాదడపా వర్షం కురుస్తున్నందున బయటి వాతావరణం అంతగా వేడిగా ఉండక పోవచ్చు. వాతావరణం ఎలా ఉన్నా బయటి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగే అలవాటును మాత్రం చాలా మంది వదులుకోలేరు. నిజానికి, రిఫ్రిజిరేటర్ నీళ్లను ఎల్లప్పుడూ తాగకూడదు. ఇది గొంతు సమస్యలను మరింత పెంచుతుంది. జీర్ణ ఆరోగ్యానికి వివిధ సమస్యలను కలిగిస్తుంది. వర్షాలు కురిసినా ఎండాకాలం పోలేదనే సంగతి గుర్తుంచుకోవాలి. కాబట్టి టీ, కాఫీలకు దూరం ఉండటం మంచిది. కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఈ సమస్య వల్ల తలనొప్పి పెరుగుతుంది. అలాగే శీతల పానీయాలకూ దూరంగా ఉండాలి. తీపి రుచి కలిగిన శీతల పానీయాలు ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో అధిక మొత్తంలో చక్కెర, కేలరీలు ఉంటాయి. ఇవి బరువు పెంచడమే పెరగడమే కాకుండా అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.

చాలా మంది త్వరగా బరువు తగ్గడానికి క్రాష్ డైట్ పాటిస్తారు. క్రాష్ డైట్‌లో చక్కెరలు, కార్బోహైడ్రేట్‌లు, ఫైబర్, ప్రొటీన్ వంటి పోషకాలు తగినంత మొత్తంలో ఉండవు. దీంతో తలనొప్పి, వికారం, విరేచనాలు, అలసట వంటి అనేక సమస్యలను వెంటాడుతాయి. శరీరానికి పోషకాల కొరత ఏర్పడిదే పని చేసేందుకు తగినంత శక్తి ఉండదు. వేసవిలో శారీరక సమస్యలను నివారించడానికి క్రాష్ డైట్‌కు దూరంగా ఉండండి. అలాగే వేసవిలో కారంగా, వేయించిన ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. వేసవిలో ఎంత తేలికైన ఆహారం తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. బదులుగా ఆహారంలో చేపలు, మాంసం, గుడ్లు వంటివి తప్పక చేర్చుకోవాలి. రెడ్‌ మీట్‌ తీసుకోకపోవడమే మంచిది. చికెన్, లీన్ ప్రోటీన్ తినవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.