Neck Pain: నిద్రలో మెడ పట్టేసిందా..? చిటికెలో నొప్పి నుంచి ఉపశమనం పొందండిలా..

|

Apr 28, 2023 | 9:16 AM

Neck Pain: చాలా మందికి నిద్రపోతున్నప్పుడు మెడ పట్టేయడం జరుగుతుంది. ఫలితంగా నిద్ర లేచిన తర్వాత తమ తలను పక్కకు కదపలేక తెగ ఇబ్బంది పడుతుంటారు. కొంచెం కదిపినా నొప్పి మరింత ఎక్కువ అవుతుంది. ఫలితంగా రోజంతా కూడా ఏ పనిచేయలేక..

Neck Pain: నిద్రలో మెడ పట్టేసిందా..? చిటికెలో నొప్పి నుంచి ఉపశమనం పొందండిలా..
Tips for Neck Pain Relief
Follow us on

Neck Pain: చాలా మందికి నిద్రపోతున్నప్పుడు మెడ పట్టేయడం జరుగుతుంది. ఫలితంగా నిద్ర లేచిన తర్వాత తమ తలను పక్కకు కదపలేక తెగ ఇబ్బంది పడుతుంటారు. కొంచెం కదిపినా నొప్పి మరింత ఎక్కువ అవుతుంది. ఫలితంగా రోజంతా కూడా ఏ పనిచేయలేక ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ సమస్య ఎప్పటికీ తగ్గుతుందంటే ఎవరూ చెప్పలేరు. ఈ క్రమంలోనే మెడ పట్టేయడం వల్ల వచ్చే నొప్పులను భరించలేక పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు కొందరు. అయితే కొన్ని చిట్కాలను అనుసరిస్తే ఎంతటి మెడ నొప్పి నుంచి అయినా తక్షణ  ఉపశమనం పొందవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

హీట్ ప్యాక్: నిద్రలో మెడ పట్టేసినప్పుడు తలను గట్టిగా తిప్పే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే నొప్పి మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇంకా అలాంటి సందర్భంలో మీరు చేయవలసిన పని హీట్ ప్యాక్ లేదా వేడికాపడం. ఇలా చేయడం వల్ల మెడ నొప్పి తొలగిపోతుంది.

ఐస్ ప్యాక్: మెడ పట్టేసినప్పుడు ఉపశమనం కోసం మీరు కోల్డ్ ప్యాక్ లేదా ఐస్ ప్యాక్ కూడా మెడపై పెట్టుకోవచ్చు. అందుకోసం మీరు కొన్ని ఐస్ ముక్కలను టవల్‏లో చుట్టి కాపడంలా మెడపై కొద్ది సమయం వరకు రుద్దుతూ ఉండాలి. ఇలా నొప్పి ఉన్న ప్రతిచోట కూడా పెట్టుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మసాజ్: మెడ పట్టేసినప్పుడు నొప్పిగా ఉన్న ప్రదేశంలో తేలికపాటి మసాజ్ చేయడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. ఇలాంట సందర్భంలో మీరు మసాజ్ కోసం ఆవాల నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనెను ఉపయోగించవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి