అమ్మాయిలకు అలర్ట్.. అదరాలకు లిప్‌స్టిక్‌ అలంకరించుకుని మురిసిపోతున్నారా? ఇదొక సైలెంట్‌ కిల్లర్..

మేకప్ తర్వాత పెదవులపై లిప్‌స్టిక్ వేసుకోకపోతే అలంకరణ పూర్తయినట్లు అనిపించదు. ముఖం అందాన్ని రెట్టింపు చేయడంలో లిప్‌స్టిక్ పాత్ర కీలకమైనది. అందుకే అమ్మాయిల మేకప్‌లో లిప్‌స్టిక్‌ చాలా కీలకం. అయితే లిప్‌స్టిక్‌ను అతిగా వేయడం అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇందులో హానికర రసాయనాలు..

అమ్మాయిలకు అలర్ట్.. అదరాలకు లిప్‌స్టిక్‌ అలంకరించుకుని మురిసిపోతున్నారా? ఇదొక సైలెంట్‌ కిల్లర్..
Harmful Ingredients In Lipstick

Updated on: Aug 19, 2025 | 9:21 PM

అమ్మాయిలు మేకప్ వేసుకున్నా, వేసుకోకపోయినా.. పెదవులపై లిప్‌స్టిక్ వేసుకోవడం అస్సలు మర్చిపోరు. ముఖం అందాన్ని రెట్టింపు చేయడంలో లిప్‌స్టిక్ పాత్ర కీలకమైనది. అందుకే అమ్మాయిల మేకప్‌లో లిప్‌స్టిక్‌ చాలా కీలకం. అయితే లిప్‌స్టిక్‌ను అతిగా వేయడం అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇందులో హానికర రసాయనాలు కూడా ఉంటాయి. ఇది ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఇందులోని ఈ రెండు రకాల పదార్థాలు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మనన్ వోరా అంటున్నారు. ఆ రసాయనాలు ఏమిటో? దీనివల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

హార్మోన్ల అసమతుల్యత

ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మనన్ వోరా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లిప్‌స్టిక్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై ఓ వీడియోను షేర్ చేశారు. అందులో రెండు పదార్థాలు ఉన్న లిప్‌స్టిక్ హార్మోన్ల అసమతుల్యత, పీరియడ్స్‌ సమస్యలకు దారితీస్తుందనే వాస్తవాన్ని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా చౌకగా లభించే లిప్‌స్టిక్‌లలో అలాంటి పదార్థాలు అధికంగా ఉంటాయని చెబుతున్నారు. కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని ఆయన హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

లిప్‌స్టిక్‌లో హానికర కారకాలు ఇవే

లిప్‌స్టిక్‌ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌లో కనిపించే బిపిఎ (బిస్ఫినాల్ ఎ), మిథైల్ పారాబెన్ లేదా ప్రొపైల్ పారాబెన్ అని డాక్టర్ మనన్ అన్నారు. ఈ రెండు అంశాలు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. ఇది శరీర హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీని కారణంగా పీరియడ్స్‌ సమస్యలు కూడా కనిపిస్తాయి.

కాబట్టి లిప్‌స్టిక్ ప్యాకేజింగ్‌పై PPA లేని లేదా పారాబెన్ లేని లిప్‌స్టిక్‌లను మాత్రమే కొనాలపి ఆయన అన్నారు. అలాగే Ecocert, Cosmos Organic or Natural, USDA Organic, PETA India Cruelty Free లేబుల్‌లు ఉన్న లిప్‌స్టిక్‌లను కొనడం మంచిది. ప్యాకేజింగ్‌పై ఇటువంటి ప్రమాణాలు ఉన్న లిప్‌స్టిక్‌లు సురక్షితమైనవి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.