మనం తీసుకునే ఆహారాలలోని పోషకాలు జుట్టుకు మూలాల నుండి సహజ రంగును అందించడమే కాకుండా, పొడవుగా, ఒత్తుగా పెరగడానికి కూడా సహాయపడతాయి. తెల్ల జుట్టును నల్లగా చేయడానికి హెన్నా, హెయిర్ డైలను ఉపయోగించడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. కానీ, దాంతో ఎదురయ్యే సైడ్‌ఎఫెక్ట్స్ కూడా చాలానే ఉంటాయి. అయితే, మీరు తినే ఆహారం, పానీయాలు కూడా మీ జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులో అతి ముఖ్యమైనది ఉసిరికాయ. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఉసిరికాయ లేదా ఆమ్లా రసం ఒక వరంలా పనిచేస్తుందని చెబుతున్నారు. అయితే, కేశ సంరక్షణ కోసం ఆమ్లా జ్యూస్‌ను ఎప్పుడు, ఎలా తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
ఆమ్లా రసంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, ఆమ్లా రసం తాగడం వల్ల మెలనిన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి, జుట్టును పునరుజ్జీవింపజేయడానికి, జుట్టును వేర్ల నుండి సహజంగా నల్లగా మార్చడానికి సహాయపడుతుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి, ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల ఆమ్లా రసం కలిపి తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జుట్టు వేర్ల నుండి నల్లగా, ఒత్తుగా పెరగడానికి ఈ రసాన్ని మూడు నుండి నాలుగు నెలల పాటు నిరంతరం తీసుకోండి.
జుట్టును ఒత్తుగా పెంచడంలో ఉసిరి సాయపడుతుంది. ఉదయాన్నే ఉసిరి రసం తాగడం వల్ల హెయిర్ ఫోలికల్స్ దృఢంగా మారుతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. తెల్ల జుట్టు సమస్య నుండి ఉపశమనం పొందాలనుకుంటే, ఉదయం ఖాళీ కడుపుతో ఆమ్లా రసం తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభావవంతమైన ఫలితాల కోసం, ప్రతిరోజూ తాజా ఆమ్లా రసం తయారు చేసుకోవడం ఉత్తమం.
అంతేకాదు.. ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పోషకాల శోషణ సామర్థ్యం మెరుగుపడుతుంది. దీంతో పోషకాల లోపం దరి చేరదు.
ఉసిరి రసంలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని బలంగా మార్చుతుంది. ఉసిరి రసం తాగితే సీజనల్ ఇన్ఫెక్షన్ల రిస్క్ తగ్గుతుంది. ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల జీర్ణ స్రావాల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో జీర్ణ సమస్యలు రావు. మలబద్దకం, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. ఉసిరి తింటే చర్మం ఎలాస్టిసిటీ పెరుగుతుంది. దీంతో ముడతలు తగ్గుతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..