
మనం మార్నింగ్ చేసే బ్రేక్ పాస్ట్ అనేది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభవాన్ని చూపుతుంది. కాబట్టి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు తరచుగా ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం, బ్రెడ్ ఆమ్లెట్ లేదా మొలకలు తీసుకుంటారు. అయితే బరువు తగ్గేందుకు ఈ రెండు ఆహారాలు ప్రయోజనకరంగానే ఉన్నప్పటికీ.. ఏది ప్రభావవంతంగా పనిచేస్తుందనే సందేహం చాలా మందిలో ఉంది. కాబట్టి పోషకాహార నిపుణుల ప్రకారం, రెండు అల్పాహారాలలో ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో చూద్దాం.
బ్రెడ్ ఆమ్లెట్: బ్రెడ్ ఆమ్లెట్లు బరువు తగ్గడానికి చాలా ప్రయోజకరంగా ఉంటుంది. కానీ ఆమ్లెట్ చేసేప్పుడు తక్కువ నూనె ఉపయోగించాలి. ఉదా.. ఒక సర్వింగ్ 2 గుడ్లు + 2 బ్రెడ్ ముక్కల్లో సుమారు 250-350 కేలరీలు, 18-22 గ్రా ప్రోటీన్, 20-30 గ్రా కార్బోహైడ్రేట్లు, 3-7 గ్రా ఫైబర్ ఉంటాయి. అయితే గుడ్లలో ఉండే అధిక నాణ్యత గల ప్రోటీన్ ఆకలిని నియంత్రిస్తుంది, కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే జీవక్రియను పెంచుతుంది. అలాగే ఎగ్స్‌లో ఉండే తక్కువ గ్లైసెమిక్ (30-50) రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే, మీరు తెల్ల బ్రెడ్‌ను నివారించాలి, ఎందుకంటే వీటిలో ఉండే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు బరువు పెరగడానికి దారితీస్తాయి.
మొలకలు: బరువు తగ్గడానికి చాలా మంది మొలకలును తీసుకుంటారు. 100 గ్రాముల మొలకలలో 25-50 కేలరీలు, 3-9 గ్రాముల ప్రోటీన్, 4-8 గ్రాముల కార్బోహైడ్రేట్లు ,1.5-2 గ్రాముల ఫైబర్ మాత్రమే ఉంటాయి. అయితే అధిక ఫైబర్ మీకు ఎక్కువసేపు కడుపు నిండినట్లు ఉంచడానికి సహాయపడుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎక్కువ తినకుండా ఆపుతుంది. అలాగే మీ శరీరంలోని కొవ్వును వేగంగా కరిగిస్తుంది. అలాగే వీటిలో ఉండే విటమిన్ సి, ఎంజైమ్‌లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
బ్రెడ్ ఆమ్లెట్ లేదా మొలకలు బరువు తగ్గేందుకు ఏది బెస్ట్ ?
మీరు మొలకలు తినడం ద్వారా బరువు తగ్గాలనే టార్గెట్ పెట్టుకుంటే.. వారానికి ఒకసారి బ్రెడ్ అమ్లెట్‌ను తినండి. అలాగే మీరు ఒక రోజులో తీసుకునే కేలరీలు 1500-1800 మధ్య ఉండేలా చూసుకోండి. మీరు వెయిట్ ట్రైనింగ్ చేస్తుంటే, వాకింగ్ లేదా రన్నింగ్ తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ (కండరాలకు ప్రోటీన్), మొలకలు తీసుకోండి. అయితే మీరు మొలకలను ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమం. అలాగే బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకునేప్పుడు ఆమ్లెట్‌లో10 గ్రాముల కంటే ఎక్కువ నూనెను వాడకండి. మీకు థైరాయిడ్ లేదా మూత్రపిండాల సమస్యలు ఉంటే వీటిని తినే ముందు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి. మొత్తానికి బరువు తగ్గడానికి బ్రెడ్ ఆమ్లెట్ కంటే మొలకలు చాలా బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. అయితే వారానికి 2-3 సార్లు బ్రెడ్ ఆమ్లెట్ తినండి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.