Sprouted Garlic: మొలకెత్తిన వెల్లుల్లిలోనే ఎక్కువ పోషకాలు..! ఆహారంలో భాగంగా తీసుకుంటే..
యాంటీ-ఆక్సిడెంట్లు తాజా వెల్లుల్లి కంటే పాత అంటే మొలకెత్తిన వెల్లుల్లిలో ఎక్కువ పరిమాణంలో కనిపిస్తాయి. ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం ద్వారా వృద్ధాప్య ప్రభావాలను కూడా నివారించవచ్చు. శరీరంపై ముడతలు, మొటిమల సమస్యను కూడా వెల్లుల్లి ద్వారా అధిగమించవచ్చు. మొలకెత్తిన వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల గుండెపోటు, హార్ట్ స్ట్రోక్ వంటి వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చు.

మొలకెత్తిన వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు, వైరస్‌లకు దూరంగా ఉండవచ్చు. మొలకెత్తిన వెల్లుల్లి రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోయింది. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఇది రక్తసరఫరాను కూడా మెరుగు చేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీరంలో కేన్సర్ కణాలు పెరగకుండా చేస్తాయి. ఇది మెదడు అభిజ్ఞా పనితీరును కూడా మెరుగు చేస్తుంది.
మొలకెత్తిన వెల్లుల్లిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. మొలకెత్తిన వెల్లుల్లిలో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ధమనులను వ్యాకోచింపజేసి.. రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. మొలకెత్తిన వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల గుండెపోటు, హార్ట్ స్ట్రోక్ వంటి వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చు.
మొలకెత్తిన వెల్లుల్లిలో ఎంజైమ్ మూలకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. యాంటీ-ఆక్సిడెంట్లు తాజా వెల్లుల్లి కంటే పాత అంటే మొలకెత్తిన వెల్లుల్లిలో ఎక్కువ పరిమాణంలో కనిపిస్తాయి. ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం ద్వారా వృద్ధాప్య ప్రభావాలను కూడా నివారించవచ్చు. శరీరంపై ముడతలు, మొటిమల సమస్యను కూడా వెల్లుల్లి ద్వారా అధిగమించవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..