Spicy Food: కారం, మసాలా ఫుడ్ తినాలనే కోరిక మహిళల్లోనే ఎక్కువ? రీజన్ ఏమిటంటే

|

Jul 13, 2024 | 10:29 AM

ఢిల్లీలోని ధర్మశిలా నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ (ఇంటర్నల్ మెడిసిన్) డాక్టర్ గౌరవ్ జైన్ మాట్లాడుతూ మహిళలలు ఎక్కువగా కారంతో కూడిన ఆహారాన్ని తినడాన్ని ఇష్టపడుతున్నారు. అయితే స్పైసీ ఫుడ్‌ తినాలనే కోరిక పెరిగిపోతుంటే అది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఆరోగ్యానికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అయితే మీరు కూడా చాలా కారంగా లేదా మసాలాలు ఉన్న ఆహారాన్ని ఇష్టపడుతుంటే వీలైనంత త్వరగా ఈ అలవాటును మార్చుకోండి.

Spicy Food: కారం, మసాలా ఫుడ్ తినాలనే కోరిక మహిళల్లోనే ఎక్కువ? రీజన్ ఏమిటంటే
Spicy Food Craving
Follow us on

ఈరోజు నాకు ఏదైనా కారం కారంగా ఉండే ఆహారాన్ని తినాలనిపిస్తుంది. అని చాలామంది ఆలోచిస్తారు. సీజన్ తో సంబంధం లేకుండా ఎక్కువగా మసాలా ఆహారాన్ని తినాలని కోరుకుంటారు. అదే వర్షాకాలం అయితే ఈ కోరిక మరింత ఎక్కువగా ఉంటుంది. తినే ఆహారంలో మసాలాలు లేదా మిర్చి జోడిస్తే ఆ ఆహరం రుచి మరింత అధికం అవుతుంది. ముఖ్యంగా భారతీయుల వంట గదిలో మాసాలకు ప్రముఖ స్థానం ఉంది. అయితే ఈ స్పైసీ ఫుడ్ అంటే కొంచెం ఎక్కువగా స్త్రీలు ఇష్టపడతారు.

ఏది ఏమైనప్పటికీ ఫాస్ట్ ఫుడ్ ఫేమస్ అయ్యాక మార్కెట్లో చాలా రకాల మసాలా ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని తినడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ విషయంపై ఢిల్లీలోని ధర్మశిలా నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ (ఇంటర్నల్ మెడిసిన్) డాక్టర్ గౌరవ్ జైన్ మాట్లాడుతూ మహిళలలు ఎక్కువగా కారంతో కూడిన ఆహారాన్ని తినడాన్ని ఇష్టపడుతున్నారు. అయితే స్పైసీ ఫుడ్‌ తినాలనే కోరిక పెరిగిపోతుంటే అది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఆరోగ్యానికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అయితే మీరు కూడా చాలా కారంగా లేదా మసాలాలు ఉన్న ఆహారాన్ని ఇష్టపడుతుంటే వీలైనంత త్వరగా ఈ అలవాటును మార్చుకోండి.

నిపుణులు ఏమని చెబుతున్నారంటే

ఇవి కూడా చదవండి

స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినాలనే కోరిక శరీరంలో అనేక మార్పులను సూచిస్తుందని డాక్టర్ జైన్ అంటున్నారు. శరీర ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభించినప్పుడు కారంగా ఉండే ఆహారం తినాలనే కోరిక కలుగుతుంది. కారంగా ఉండే ఆహారం శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత శరీరం చెమటలు పట్టడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంతేకాదు బాడీ మాస్ ఇండెక్స్ అంటే బరువు పెరిగినా స్పైసీ ఫుడ్ తినాలనే తృష్ణ ఏర్పడుతుంది. అంతేకాదు సుదీర్ఘమైన టెన్షన్, ఒత్తిడి కారణంగా మహిళలు స్పైసీ ఫుడ్ తినాలనే ఆరాటపడతారు.

మసాలా ఆహారంలో క్యాప్సైసిన్

స్పైసీ ఫుడ్‌లో ఉండే క్యాప్సైసిన్ ఒత్తిడి సమయంలో ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. అంతేకాదు మసాలా ఆహారం తినాలనే కోరిక నిరంతరం పెరుగుతూ ఉంటే.. అది శరీరంలోని అనేక వ్యాధులకు సంకేతం కూడా కావచ్చు. కనుక శరీరంలోని మార్పులపై శ్రద్ధ వహించండి. మీకు ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండని సూచిస్తున్నారు డాక్టర్ జైన్.

గర్భధారణ సమయంలో

హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం గర్భధారణ సమయంలో కూడా మహిళలకు స్పైసీ ఫుడ్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. 635 మంది మహిళలపై నిర్వహించిన పరిశోధనలో గర్భధారణ సమయంలో, మహిళలు చాక్లెట్, ఐస్ క్రీం, డెజర్ట్‌లను తినాలని కోరుకున్నారు. అంతేకాదు అదే అధ్యయనంలో 3.3 శాతం మంది మహిళలు కూర, మసాలా ఆహారం, ఎక్కువగా కారంగా ఉన్న ఆహారం తినాలనే కోరికతో ఉన్నారు. అయితే గర్భధారణ సమయంలో మహిళలకు కలిగే ఆహార కోరికలకు కారణాల గురించి స్పష్టమైన సమాచారం లేదు. అయితే మహిళల్లో కలిగే హార్మోన్ల మార్పులు, స్పైసీ ఫుడ్స్‌లో ఉండే పోషకాలు దీనికి కారణమని పరిశోధకులు భావిస్తున్నారు.

నులిపురుగుల వల్ల

స్పైసీ ఫుడ్ కోసం ఆరాటపడటానికి మరో ఆసక్తికరమైన కారణం ఉంది. ఎవరైనా స్పైసీ ఫుడ్ ని లేదా కారం అధికంగా ఉన్న ఆహారం తినకుండా ఉండటానికి ప్రయత్నించినా అదుపు చేసుకోరు.. స్పైసీ ఫుడ్ ని ఎక్కువగా తినాలని భావిస్తారు. దీనికి కారణం కడుపులో నులిపురుగుల ఉంటే స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుందట.

సహజ నివారణగా స్పైసీ ఫుడ్

కారం ఎక్కువగా ఉన్న ఆహారం లేదా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడల్లా కళ్ళ నుంచి లేదా ముక్కు నుంచి నీరు ఖచ్చితంగా వస్తుంది. అయినప్పటికీ వేడి సూప్‌లు లేదా సాస్‌లు వంటి మసాలా ఆహారాలు తరచుగా జలుబు సమయంలో వంటింటి చిట్కాలుగా ఇస్తారు. స్పైసీ ఫుడ్ తినడం వల్ల దృఢత్వం నుంచి ఉపశమనం పొందవచ్చని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది.

స్పైసీ ఫుడ్ హానికరం

మసాలా ఎక్కువుగా ఉన్న ఆహారం తినడం పొట్టకు మంచిది కాదు. కడుపు నొప్పికి కారణం కావచ్చు. అంతేకాదు కారం ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వలన ప్రేగులపై కూడా కనిపిస్తుంది. ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడం వల్ల కూడా గుండెల్లో మంట వస్తుంది. అంతే కాదు నోటిపూత కూడా వస్తుంది.

ఏ విషయాలు గుర్తుంచుకోవాలంటే

ఎవరైనా సరే సమతుల్య ఆహారంతో పాటు స్పైసీ ఫుడ్‌ను ఆస్వాదించవచ్చని, అయితే కొంత మంది జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని డాక్టర్ పంకజ్ జైన్ చెప్పారు. స్పైసీ ఫుడ్ సాధారణంగా గర్భిణీలకు సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. అయితే గుండెల్లో మంట లేదా అజీర్ణం వంటి లక్షణాలను అనుభవిస్తే వెంటనే మసాలా ఆహారానికి దూరంగా ఉండాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..