కోవిడ్-19 అనంతరం ప్రజలంతా ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ వహిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారంతో పాటు తగిన వ్యాయమాలు, యోగ వంటివి అలవాటుగా చేసుకుంటున్నారు. ఇవన్నీంటితో పాటు రెగ్యూలర్ వాకింగ్ కూడా చేస్తుంటారు. అయితే, వాకింగ్ విషయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి రోజూ వాకింగ్ చేసేవారు వేగంగా నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజు పదివేల అడుగులు నడవడం వలన గుండె సంబంధిత సమస్యలు ఉండవు. అకాల మరణం ముప్పు కూడా తగ్గుతుందని సూచిస్తున్నారు. బీపీ, కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతాయి. వాకింగ్ చేయడం వలన ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. నరాల పనితీరు కూడా బాగుంటుంది. వేగంగా నడిస్తే మెదడు పని తీరుపై అనుకూల ప్రభావం కనబడుతుంది. మూడ్ స్వింగ్స్, జ్ఞాపకశక్తి, మంచి నిద్రకి కూడా మేలు చేస్తుంది. వేగంగా నడవడం వల్ల మరేన్నో ఉపయోగాలు ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఒక నివేదిక ప్రకారం.. మీరు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకుంటే ప్రతిరోజూ గంటకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కిలోమీటర్ల వేగంతో నడవాలని వెల్లడైంది. వాకింగ్ వేగం ఎంత ఎక్కువగా ఉంటే.. దానితో సంబంధం ఉన్న ప్రమాదం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. గంటకు 3-5 కిలోమీటర్ల సగటు నడక వేగం నెమ్మదిగా నడవడం కంటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 15శాతం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. వేగంగా నడవటం వల్ల మధుమేహం నివారణలో సహాయపడటమే కాకుండా అనేక సామాజిక, మానసిక మరియు శారీరక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
మాములు నడక కంటే వేగంగా నడవటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి ముప్పు నుంచి రక్షించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వేగంగా నడవటం వల్ల ఏరోబిక్ ఆక్టివిటీ పెరుగుతుంది. రోజూ 10 వేల అడుగులు నడవటం వల్ల గుండె సంబంధిత, అకాల మరణాల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. బీపీ, కొలెస్ట్రాల్ సైతం నియంత్రణలో ఉంటాయి. వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. నరాల పనితీరు మెరుగుపడుతుంది. వేగంగా నడవటం వల్ల మెదడు పనితీరుపై అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది మూడ్ స్వింగ్స్, జ్ఞాపకశక్తి, నిద్రకు మేలు చేస్తుంది.
వేగంగా నడవటం వల్ల కండరాల బలాన్ని పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. సాధారణంగా గుండె, రక్త నాళాలపై తీవ్రమైన ఒత్తిడి కలిగినప్పుడు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. వేగంగా నడిచే అలవాటు ఉన్నవారిలో బరువు కంట్రోల్‌లో ఉంటుంది. వేగంగా నడిచినప్పడు గుండెకు వేగంగా రక్త ప్రసరణ జరిగి ఆరోగ్యంగా ఉంటామని వైద్యారోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..