AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్‌స్టా పోస్ట్‌పై ట్రోలింగ్.. ‘ప్రతి మాట నా అనుభవమే’ అంటూ సీనియర్ హీరోయిన్ క్లారిటీ!

సోషల్​ మీడియా వల్ల ఎంత లాభం ఉందో అంతకు పదింతలు నష్టం కూడా ఉంది. సాంకేతికతని సరైన దారిలో వాడితే మానవ జీవనానికి చాలా ప్రయోజనకరం, కానీ ఈరోజుల్లో చాలామంది దానిని దుర్వినియోగపరుస్తూ ఇతరులను ఇబ్బందులపాలు చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్​ మీడియా చాలా ప్రమాదకరంగా ..

ఇన్‌స్టా పోస్ట్‌పై ట్రోలింగ్.. ‘ప్రతి మాట నా అనుభవమే’ అంటూ సీనియర్ హీరోయిన్ క్లారిటీ!
Senior Heroine
Nikhil
|

Updated on: Nov 25, 2025 | 6:24 PM

Share

సోషల్​ మీడియా వల్ల ఎంత లాభం ఉందో అంతకు పదింతలు నష్టం కూడా ఉంది. సాంకేతికతని సరైన దారిలో వాడితే మానవ జీవనానికి చాలా ప్రయోజనకరం, కానీ ఈరోజుల్లో చాలామంది దానిని దుర్వినియోగపరుస్తూ ఇతరులను ఇబ్బందులపాలు చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్​ మీడియా చాలా ప్రమాదకరంగా మారుతోంది. చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ట్రోల్స్​ బారిన పడినవాళ్లే.

విషయం ఏదైనా దానికి మరో విషయాన్ని జోడించి తప్పుగా చిత్రించడం ఈరోజుల్లో కొత్తేం కాదు. తాజాగా ఓ సీనియర్​ హీరోయిన్​ సోషల్ మీడియా ట్రోల్స్​ బారిన పడింది. ఆమె పెట్టిన పోస్ట్​ని తప్పుగా చిత్రిస్తూ చాలామంది కామెంట్​ చేశారు. కానీ వాళ్లకి మరోపోస్ట్​తో గట్టిగా సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఎవరా హీరోయిన్​, ఏం జరిగింది?

క్యాన్సర్ నుంచి బయటపడి ఎందరికో ఆదర్శంగా నిలిచిన నటి సోనాలి బింద్రే. టాలీవుడ్, బాలీవుడ్​లో స్టార్​ హీరోయిన్​గా రాణించిన సోనాలి క్యాన్సర్​ బారిన పడినప్పుడు పరిశ్రమంతా ఆమెకు అండగా నిలిచింది. 2018లో స్టేజ్ ఫోర్ మెటాస్టాటిక్ క్యాన్సర్ డయాగ్నోస్ అయినప్పుడు, ఆమె న్యూయార్క్‌లో చికిత్స తీసుకుని 2021లో క్యాన్సర్-ఫ్రీ అయింది. ఇప్పుడు ఆమె క్యాన్సర్ అవేర్‌నెస్ అడ్వకేట్‌గా మారి, సర్వైవర్‌లకు సపోర్ట్ ఇస్తోంది. కానీ ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఒక వివాదానికి దారితీసింది. ఆటోఫాజీని క్యాన్సర్ క్యూర్‌గా చెప్పినట్టు కొందరు ఆరోపించారు. డాక్టర్లు ‘క్వాకరీ’ అని విమర్శించారు. అయితే వాటికి సొనాలీ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

‘నేను క్యాన్సర్ సర్వైవర్. ఆ భయం, నొప్పి, అనిశ్చితి.. ఈ రోగం తెచ్చే ప్రతి ఒక్కటి నేను అనుభవించాను. నేను ఇప్పటివరకు మాట్లాడిన ప్రతి మాట కేవలం నా అనుభవం, నేను నేర్చుకున్న విషయాలు మాత్రమే. నేను ఎప్పుడూ ఇది చెప్పలేదు, రెండు క్యాన్సర్ కేసులు ఒకేలా ఉంటాయని, లేదా ట్రీట్‌మెంట్ మార్గం అందరికీ ఒకటే అని. నాకు వ్యక్తిగతంగా పనిచేసిన, థోరో రీసెర్చ్ చేసి, వైద్యుల మార్గదర్శకత్వంలో ట్రై చేసిన ఒక ప్రోటోకాల్ ఆటోఫాజీ. అది నాకు ఉపశమనం ఇచ్చింది. ఇప్పటికీ దానివల్ల నాకు మంచి జరుగుతోంది.

Sonali2

Sonali2

నిజంగా ముఖ్యమైనది ఒకటే.. ఓపెన్ మైండెడ్, గౌరవంతో కూడిన సంభాషణ. మనం అందరూ ఒకే విషయంపై అంగీకరించాల్సిన అవసరం లేదు, కానీ ఒకరి అనుభవాన్ని కేవలం వేరే అభిప్రాయం ఉందని కొట్టిపారేయకూడదు. ప్రతి వ్యక్తి తనకు సురక్షితంగా, బలంగా, శక్తినిచ్చే మార్గాన్ని ఎంచుకోవాలి. నేను ఎల్లప్పుడూ నా యాత్రను నిజాయితీతో, వినయంతో షేర్ చేస్తాను. ఎప్పుడూ ఎక్స్‌పర్టైజ్‌తో కాదు, కేవలం నా అనుభవంతో మాత్రమే’ అని తాను పోస్ట్​ చేసిన విషయాన్ని వివరించింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ‘ఆటోఫాజీ ఒక ప్రోటోకాల్, నేను థరో రీసెర్చ్, మెడికల్ గైడెన్స్ తీసుకుని ట్రై చేశాను. అది నాకు డిఫరెన్స్ చేసింది, ఇప్పటికీ చేస్తోంది’ అని సొనాలి బింద్రే పోస్ట్ చేసింది. అయితే డాక్టర్లు, ముఖ్యంగా హెపటాలజిస్ట్ సైరియాక్ ఆబీ ఫిలిప్స్ (ది లివర్ డాక్) దీన్ని ‘ఫ్రాడ్’ అని, ‘నేచురోపతి’ కింద ఇలాంటి ట్రీట్‌మెంట్స్ డేంజరస్ అని విమర్శించారు. ‘ఇవి ఎవిడెన్స్-బేస్డ్ కేర్ డిలే చేస్తాయి, పేషెంట్స్‌కు హాని చేస్తాయి’ అని ఆయన అన్నారు. FDA కూడా ఇలాంటి ఇల్లీగల్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్స్‌పై వార్నింగ్ ఇచ్చిందట. ఈ బ్యాక్‌లాష్ సోనాలి మీద భారీగా పడింది. ఆమె క్వాక్ అని, మిస్‌లీడ్ చేస్తోందని ఆరోపణలు వచ్చాయి. దాంతో సొనాలీ తన వ్యాఖ్యలపై మరో పోస్ట్​తో వివరణ ఇచ్చింది.