AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాగి పాత్రలు ఇంత డేంజరా ?

ఆరోగ్యానికి చాలా మంచివి అంటూ ఈ మధ్యకాలంలో ప్రచారం పెరిగిపోవడంతో చాలామంది వంటకోసం, తాగే నీళ్లను స్టోర్ చేసుకోవడం కోసం రాగి పాత్రలను ఉపయోగిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వీటికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.. అయితే రాగిపాత్రలను ప్రతిసారీ ఉపయోగించడం అంత సేఫ్ కాదనే విషయం చాలా మందికి తెలియదు.. రాగిపాత్రల్లో వండినప్పడు, లేదా నిలువ ఉంచినప్పడు కొన్ని పదార్థాలు నెగటివ్ రియాక్షన్స్ ని ఇస్తుంటాయి.. మనం ఎంతో ఇష్టపడి తినే ఊరగాయలు, పచ్చళ్లను రాగి […]

రాగి పాత్రలు ఇంత డేంజరా ?
Pardhasaradhi Peri
|

Updated on: Nov 25, 2019 | 8:20 PM

Share

ఆరోగ్యానికి చాలా మంచివి అంటూ ఈ మధ్యకాలంలో ప్రచారం పెరిగిపోవడంతో చాలామంది వంటకోసం, తాగే నీళ్లను స్టోర్ చేసుకోవడం కోసం రాగి పాత్రలను ఉపయోగిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వీటికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.. అయితే రాగిపాత్రలను ప్రతిసారీ ఉపయోగించడం అంత సేఫ్ కాదనే విషయం చాలా మందికి తెలియదు.. రాగిపాత్రల్లో వండినప్పడు, లేదా నిలువ ఉంచినప్పడు కొన్ని పదార్థాలు నెగటివ్ రియాక్షన్స్ ని ఇస్తుంటాయి.. మనం ఎంతో ఇష్టపడి తినే ఊరగాయలు, పచ్చళ్లను రాగి గిన్నెల్లో స్టోర్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే వాటిలో ఉండే పుల్లదనానికి రాగిలో ప్రతిచర్యలు జరిగి అది తిన్నప్పుడు ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారచ్చు..అలాగే వెన్న, క్రీం , పాలను స్టోర్ చేసినప్పడు కూడా అది ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇక నిమ్మరసం, నారింజ రసం లాంటి సిట్రస్ జూస్లను రాగి గ్లాసుల్లో ఉంచితే డేంజర్ .. పెరుగును కూడా చాలామంది రాతిగిన్నెల్లో తోడు వేస్తుంటారు..అయితే అందులో ఉండే యాసిడ్స్ కాపర్ తో రియాక్ట్ అయ్యే అవకాశాలున్నాయి.

రాగి మన శరీరంలోకి చేరడం వల్ల కలిగే ఇబ్బందులు చాలానే ఉంటాయి. ముఖ్యంగా జీర్ణశయాంతర సమస్యలు కలుగుతుంటాయి. కడుపులో గ్యాస్, వాంతులు, విరేచనాలు తిమ్మిరి లాంటివి రావడానికి కారణం రాగి అధికంగా వాడటం వల్ల ఉండవచ్చు అని మనం గ్రహించాలి .మనిషి మెటబాలిసం ప్రకారం మన శరీరం రాగిని చిన్న మొత్తంలో ప్రాసెస్ చేయగలదు, కానీ అదే ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.

ఇక చిన్న పిల్లలకు ఇచ్చే ఆహారాన్ని తయారుచేసేటప్పుడు రాగి పాత్రలను ఉపయోగించకపోవడమే మంచిది. మీరు రాగి పాత్రలను ఉపయోగిస్తూ పిల్లల్లో గ్యాస్ కి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే రాగి పాత్రలు పక్కన పెట్టి, స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా టెఫ్లాన్ కోటింగ్ ఉన్న వంటసామాన్లను వాడటం మంచిది.

రాగి పాత్రల్లో ఏదైనా వంట చేసినప్పుడు, అది మాడిపోతే.. ఆ పాత్రలను తరువాత వాడకుండా వదిలేయడమే మంచిది..ఎందుకంటే, ఆ పాత్రలని అలాగే ఉపయోగిస్తూ వెళితే ఎక్కువ శాతం కాపర్ వచ్చి ఫుడ్ లో చేరే అవకాశముంటుంది.. అందుకే రాగి పాత్రలను, బాటిల్స్ ని ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడకూడదు అన్న విషయాలు సరిగ్గా తెలుసుకొని వాడటం చాలా ముఖ్యమని డాక్టర్లు సూచిస్తున్నారు.