Soft Chapati: మీరు ఇంట్లో చేసిన చపాతీలు మెత్తగా దూదీలా రావాలంటే..ఇలా ట్రై చేయండి..!

ఇలా కలుపుకున్న చపాతీ పిండితో మీకు కావాల్సిన సైజులో ముద్దలు చేసుకుని చపాతీలను తయారు చేసుకోండి..చపాతీలను చేసి తవ్వపై వేసి కాసేపు వేడి అయ్యాక.. అటు ఇటు తిప్పుతూ సరిగ్గా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న చపాతీలను హాట్‌ప్యాక్‌లోకి తీసిపెట్టుకోండి. ఈ టిప్స్ పాటిస్తే మీ ఇంట్లో చేసిన చపాతీలు నోటికి రుచిగా మెత్తని, దూదీలా ఉంటాయి. నోటిలో ఇలా వేసుకొగానే..అలా లోపలికి జారీపోతాయి.

Soft Chapati: మీరు ఇంట్లో చేసిన చపాతీలు మెత్తగా దూదీలా రావాలంటే..ఇలా ట్రై చేయండి..!

Updated on: Jun 28, 2025 | 12:27 PM

చపాతీలంటే.. చాలా మందికి ఇష్టం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్‌లో కూడా చపాతీలను తినేవారు ఎక్కువగానే ఉంటారు. కానీ, కొంత మందికి చపాతీలు చేయడం సరిగ్గారాదు. చపాతీలు గట్టిగా వస్తుంటాయి. దీంతో తినలేక ఇబ్బందులు పడుతుంటారు. కానీ, కొన్ని టిప్స్ పాటిస్తే చపాతీలు దూదీలా మెత్తగా చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా చపాతీ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందుకు సరిపడా గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. చపాతి పిండిని చక్కగా చపాతీల తయారీకి ఎలా కావాలో అలా అంతా కలుపుకోవాలి.

ఇలా తడిపిన పిండిని ఒక ఐదు నిమిషాల పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు స్పూన్ల చక్కెరను తీసుకుని గ్రైండర్‌లో వేసుకుని పౌడర్‌గా చేసుకోవాలి. ఈ పొడిని చపాతీ పిండిలో వేయాలి. దీనిలో రెండు స్పూన్ ల నూనె కూడా యాడ్‌ చేసుకోవాలి. మళ్లీ చపాతీ పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి.

ఇలా కలుపుకున్న చపాతీ పిండితో మీకు కావాల్సిన సైజులో ముద్దలు చేసుకుని చపాతీలను తయారు చేసుకోండి..చపాతీలను చేసి తవ్వపై వేసి కాసేపు వేడి అయ్యాక.. అటు ఇటు తిప్పుతూ సరిగ్గా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న చపాతీలను హాట్‌ప్యాక్‌లోకి తీసిపెట్టుకోండి. ఈ టిప్స్ పాటిస్తే మీ ఇంట్లో చేసిన చపాతీలు నోటికి రుచిగా మెత్తని, దూదీలా ఉంటాయి. నోటిలో ఇలా వేసుకొగానే..అలా లోపలికి జారీపోతాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..