నిద్రపోయే సమయంలో ఎలా పడుకుంటున్నారు? మీ పోజిషన్ బట్టి మీ ఆరోగ్యం ఎలా ఉందో ఇట్టే చెప్పొచ్చు..

|

Jan 22, 2023 | 7:02 PM

ఆరోగ్యంగా ఉండాలంటే కంటికి సరిపడా నిద్రపోవాలి. లేదంటే మన ఆలోచనా శక్తి, ఏకాగ్రత, భావోద్వేగాలు, శారీరక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. ఐతే ఒక్కోసారి చాలా సమయం నిద్రపోయినా, సరిగా నిద్రపోలేదనే భావన..

నిద్రపోయే సమయంలో ఎలా పడుకుంటున్నారు? మీ పోజిషన్ బట్టి మీ ఆరోగ్యం ఎలా ఉందో ఇట్టే చెప్పొచ్చు..
Sleeping Positions
Follow us on

ఆరోగ్యంగా ఉండాలంటే కంటికి సరిపడా నిద్రపోవాలి. లేదంటే మన ఆలోచనా శక్తి, ఏకాగ్రత, భావోద్వేగాలు, శారీరక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. ఐతే ఒక్కోసారి చాలా సమయం నిద్రపోయినా, సరిగా నిద్రపోలేదనే భావన కలుగుతుంది. అందుకు కూడా కారణాలు లేకపోతేదు. మనం పడుకునే భంగిమలు కూడా మన నిద్రపై ప్రభావం చూపుతాయి. నిద్రపోయే సమయంలో పడుకునే పొజిషన్‌ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. మరైతే నిద్రపోయే సమయంలో ఎలా పడుకోవాలి..? నిపుణుల సలహాఇదే..

ఒకవైపు పడుకోవడం ఉత్తమమైన మార్గమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవైపు నిద్రపోవడం వల్ల గురక సమస్య కూడా తీరుతుంది. నిద్ర నాణ్యతను, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా సైడ్ స్లీపర్లలో.. ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరమని చెబుతున్నారు. ఈ పొజీషన్‌లో పడుకోవడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన యాసిడ్ మన ఆహార పైపులోకి చేరదు. గర్భిణీ స్త్రీలు ఎడమ వైపున నిద్రిస్తే వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

బాగా అలసిపోయిన వాళ్లు ఎవరైనా బోర్లా పడుకోవడానికి ఇష్ట పడతారు. ఐతే ఈ పొజిషన్‌లో ఎక్కువ సమయం నిద్రించడం ఆరోగ్యానికి అంతమంచిదికాదని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. బోర్లా పడుకోవడం వల్ల శరీరంలోకి ఆక్సిజన్‌ ప్రసరణ తగ్గుతుంది. అంతకన్నా వీపును నిటారుగా ఉంచి వెళ్లకిలా పడుకోవడం బెటర్‌. ఐతే గురక, నిద్రలేమితో బాధపడేవారు వెళ్లకిలా పడుకోవడానికి దూరంగా ఉండాలి.ప్రపంచ జనాభాలో 47 శాతం మంది ఓ పక్కకు వరిగి ముడుచుకు పడుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ఇలా వంకరగా నిద్రపోవడానికి ఇష్టపడుతుంటారు. యువత ఇలా నిద్రపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ పెద్దవయసు వారు ఇలా నిద్రపోతే చేతులు, పాదాలు, మణికట్టు భాగాల్లోని నరాల్లో రక్తప్రసరణ నిలిచిపోయి చేతులు, కాళ్లు మొద్దుబారిపోయే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.