చాలా మంది బెడ్‌పై పడుకోవడానికి ఇష్టపడతారు. అయితే నేలపై పడుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా.? నేలపై పడుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు ప్రజలంతా నేలపై పడుకునేవారు. కానీ కాలంతో పాటు ఈ పద్ధతి కూడా మారింది. అంతే కాకుండా రకరకాల బెడ్లు కూడా రావడం మొదలయ్యాయి. అయితే నేలపై పడుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
నేలపై పడుకోవడం వల్ల వెన్నెముక మంచి ఆకృతిలో ఉంటుంది. ఇది వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా నేలపై పడుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
నేలపై పడుకోవడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. ఇది ఎటువంటి సంక్లిష్టతలను కలిగి ఉండదు.. శరీర బరువును తగ్గించే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఒత్తిడి, అసౌకర్యం తొలగిపోతాయి. నేలపై పడుకోవడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
నేలపై పడుకోవడం వల్ల ప్రయోజనమే కాకుండా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కీటకాలు, నేలపై ఉండే దుమ్ము వల్ల అలర్జీ ఉన్నవారికి నిద్ర సరిగా పట్టదు. అందుకే రెగ్యులర్ గా ఫ్లోర్ శుభ్రం చేయడం వల్ల అలర్జీ తగ్గుతుంది. అదేవిధంగా వెన్నునొప్పి ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు వైద్యులను సంప్రదించిన తర్వాత మాత్రమే నేలపై పడుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..