Health Tips: బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేస్తున్నారా.. ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారో తెలుసా..

| Edited By: Surya Kala

Dec 28, 2024 | 1:01 PM

మూడు పూటలా కడుపు నిండా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం అని పెద్దలు అంటుంటారు. ముఖ్యంగా ఉదయం టిఫిన్ తప్పకుండా చేయాలని లేకపోతే ఆరోగ్యానికి ఇబ్బంది అని అంటుంటారు. అయితే కొంత మంది మాత్రం అది తప్పని అంటుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏం లేదని..పైగా ఆరోగ్యానికి మంచిది అని అంటున్నారు. అయితే బ్రేక్ ఫాస్ట్ తినాల వద్దా? తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయి? బ్రేక్ ఫాస్ట్ చేస్తే మంచిదా..?చేయక పోతే మంచిదా? తెలుసుకుందాం..

Health Tips: బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేస్తున్నారా.. ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారో తెలుసా..
Breakfast Skipping
Follow us on

ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం, ఇప్పుడున్న చలికి ఆకలి వేయడం లేదనీ బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తుంటాం.. అప్పుడ ప్పుడు అల్ఫారం తినడం మానేస్తే ఏమో కానీ.. కొంతకాలం ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం మీ ఆరోగ్యం దెబ్బతింటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే శరీరానికి తగిన పోషకాలు సరిగ్గా అందవు అని అంటున్నారు. పైగా టిఫిన్ చేయకుండానే ఇంటి పనులు చేసుకోవడం, ఆఫీసుకు వెళ్లడం వంటివి తరచుగా కొనసాగితే.. కోపం, చికాకు వంటివి పెరుగుతాయనీ చెబుతున్నారు. అంతేకాదు రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోవడంవల్ల మెదడు కణాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో ఏకాగ్రతను కోల్పోతారని, చేసే పనిలో ప్రొడక్టివిటీ తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రోజు బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం దీర్ఘ కాలం పాటు కొనసాగితే నిద్రలేమి, మైగ్రేన్ వంటి సమస్యలు కూడా స్టార్ట్ అవుతాయని న్యూరాలజీ అండ్ వెల్నెస్ సెంటర్ ఆఫ్ అమెరికా పరిశోధకులు అంటున్నారు. దీంతో బ్రెయిన్ యాక్టివిటీ లో ప్రతికూల మార్పులు వస్తాయి. ఫలితంగా జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, మానసిక ఆందోళన వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. అందుకే తగిన పోషకలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ చేయడం, క్వాలిటీ స్లీప్ ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.

మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం వల్ల జీర్ణ సమస్యల రిస్క్ పెరుగుతుంది. ఉదయం ఆహారం తినకపోవడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది. తరచుగా కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. పేగు కదలికల్లో అవాంతరాలు ఏర్పడతాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారాలను తప్పక తినాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..