Yoga Benefits: యోగాలోని ఈ ఆసనం ఉపయోగాలు తెలిస్తే నోరెళ్లబెడతారు.. ఏంటో తెలుసుకోవాలంటే ఓ లుక్కెయ్యండి

యోగా ద్వారా శరీరాన్ని కూడా స్ట్రెచ్‌బుల్‌గా ఉంచుకోవచ్చు. మనస్సును రిలాక్స్ చేయడంతో పాటు కంటి నిండా నిద్రపోవడానికి యోగా సాయం చేస్తుంది. ప్రతి రోజూ యోగా చేయడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని పెంచుకోవడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చుకోవచ్చు.

Yoga Benefits: యోగాలోని ఈ ఆసనం ఉపయోగాలు తెలిస్తే నోరెళ్లబెడతారు.. ఏంటో తెలుసుకోవాలంటే ఓ లుక్కెయ్యండి
Yoga

Updated on: Feb 21, 2023 | 10:30 AM

యోగాతో చాలా ఆరోగ్యప్రయోజనాలున్నాయని అందరికీ తెలిసిందే. శారీరక బలం పెంచడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా యోగా ద్వారా మెరుగుపర్చుకోవచ్చు. యోగా ద్వారా శరీరాన్ని కూడా స్ట్రెచ్‌బుల్‌గా ఉంచుకోవచ్చు. మనస్సును రిలాక్స్ చేయడంతో పాటు కంటి నిండా నిద్రపోవడానికి యోగా సాయం చేస్తుంది. ప్రతి రోజూ యోగా చేయడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని పెంచుకోవడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చుకోవచ్చు. అలాగే దీర్ఘకాలిక రుగ్మతల నుంచి యోగా సాధన ద్వారా రక్షణ పొందవచ్చు. కాబట్టి ఫిట్‌నెస్ నిపుణులతో పాటు వైద్యులు కూడా యోగా సాధన చేయాలని సూచిస్తుంటారు. యోగా చేస్తే ముఖ్యంగా శరీరంలోని కండరాల వదులవతాయి. అంటే భుజం, మెడ వంటి శరీర భాగాలు మెరుగ్గా పని చేయాలంటే వాటిల్లో స్థిరమైన కదలిక చాలా అవసరం. 

ఆలియాభట్, కరీనా కపూర్ వంటి బాలివుడ్ ప్రముఖులకు యోగా ట్రైనర్ అయిన అన్షుక పర్వాని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు యోగాసనాల ఆవశ్యకతను ఫాలోవర్స్ అందిస్తూ ఉంటారు. ఇటీవల ఇన్‌స్టా పోస్ట్‌లో ఆమె షోల్డర్ స్టాండ్‌ యొక్క ఉపయోగాలను వివరించింది. ఈ ఆసనం రోటీన్‌గానే ఉన్నా అద్భుత ప్రయోజనాలు ఇస్తుందని పేర్కొంది. ఈ వీడియో మొత్తం అన్షుక తన శరీరాన్ని తన భుజాలపై స్టాండ్ చేస్తుంది. ఇలా చేయడం ద్వారా శరీరాన్ని బలంగా చేసుకోవడంతో పాటు మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని సూచించింది. ఈ ఆసనం ముఖ్యంగా మెడ, భుజాల్లో కదలికను వేగంగా పెంచుతుంది. కాలు, వెనుక కండరాలను సాగదీయడానికి,బలోపేతం చేయడానికి సాయం చేస్తుంది. షోల్డర్ స్టాండ్‌ను చేయడం ద్వారా థైరాయిడ్, పారా థైరాయిడ్ గ్రంధుల్లో రక్తం నిర్వహణకు ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపర్చడంతో పాటు అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. కాళ్ల అమరిక సరిగ్గా లేకపోవడం వల్ల వెనెముక, మెడపై అనవసరమైన ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఈ ఆసనాన్ని దశల వారీగా నేర్చుకుంటూ ప్రతిరోజూ చేయాలని ఆమె సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..