Curd In Winter: చలికాలంలో పెరుగు తింటున్నారా..? ఆరోగ్య నిపుణులు చెప్పేది తెలిస్తే..

పెరుగు.. ప్రతి భారతీయుడి భోజనంలో ముఖ్యమైన, ఉపయోగకరమైన ఆహారం. దాని శీతలీకరణ లక్షణాలు, జీర్ణక్రియకు ప్రయోజనకరమైన ప్రోబయోటిక్స్, శరీరానికి శక్తిని అందించే సామర్థ్యం కారణంగా దీనిని 'సూపర్ ఫుడ్'గా పరిగణిస్తారు. అయితే, చాలా మంది శీతాకాలంలో పెరుగును దూరం పెడుతుంటారు. పెరుగు చల్లగా ఉంటుంది.. కాబట్టి, దీనిని తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు కలిగిస్తుందని నమ్ముతారు. కానీ, శీతాకాలంలో పెరుగు తినడం నిజంగా ఆరోగ్యానికి హానికరమా..?

Curd In Winter: చలికాలంలో పెరుగు తింటున్నారా..? ఆరోగ్య నిపుణులు చెప్పేది తెలిస్తే..
Curd Side EffectsIn Winter

Updated on: Jan 17, 2026 | 6:46 PM

పెరుగు.. ప్రతి భారతీయుడి భోజనంలో ముఖ్యమైన, ఉపయోగకరమైన ఆహారం. దాని శీతలీకరణ లక్షణాలు, జీర్ణక్రియకు ప్రయోజనకరమైన ప్రోబయోటిక్స్, శరీరానికి శక్తిని అందించే సామర్థ్యం కారణంగా దీనిని ‘సూపర్ ఫుడ్’గా పరిగణిస్తారు. అయితే, చాలా మంది శీతాకాలంలో పెరుగును దూరం పెడుతుంటారు. పెరుగు చల్లగా ఉంటుంది.. కాబట్టి, దీనిని తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు కలిగిస్తుందని నమ్ముతారు. కానీ, శీతాకాలంలో పెరుగు తినడం నిజంగా ఆరోగ్యానికి హానికరమా..? అది మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుందా..? నిపుణులు చెబుతున్న అసలు వాస్తవం ఏంటో ఇక్కడ చూద్దాం…

పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

పెరుగులో ప్రోటీన్, కాల్షియం, భాస్వరం, జింక్, విటమిన్లు B2, B12 ఉంటాయి. పెరుగు మంచి బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. ఇది శరీరానికి చేరిన తర్వాత ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. పెరుగు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇందులో విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థతో పాటు జుట్టు, చర్మాన్ని కూడా అందంగా చేస్తాయి. పెరుగు తినడం కడుపును చల్లగా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇది చాలా తేలికగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి సులభం. పెరుగు తినడం వల్ల ఎముకలు, దంతాలు బలపడతాయి. ఇందులో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అయితే, చలికాలంలో పెరుగు తినాలా వద్దా?:

పెరుగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. దీన్ని తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి, మీరు దీన్ని ఎప్పుడైనా తినవచ్చు. శీతాకాలం, వేసవి కాలం సీజన్‌ ఏదైనా సరే…పెరుగు హానికరం కాదు. కానీ, మీరు పెరుగు తినడానికి సరైన సమయం తెలుసుకోవాలి. ప దీనికి సరైన సమయం లంచ్‌ టైమ్‌. రాత్రిపూట పెరుగు తినడం హానికరం. పెరుగు చల్లగా ఉంటుంది. కాబట్టి, రాత్రిపూట తినడం వల్ల జలుబు, దగ్గు సమస్య వేదించే అవకాశం ఉంది. పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. కనీసం ఐదు నుంచి 10 నిమిషాలు గ్యాప్‌ తర్వాత తీసుకోండి. మీకు ఇప్పటికే జలుబు, దగ్గు ఉంటే పెరుగు తినడం మానుకోండి.

పెరుగు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు:

పెరుగులోని ప్రోబయోటిక్స్ మీ ప్రేగులోని బ్యాక్టీరియాను సమతుల్యం చేస్తాయి. ఆహారం ఎక్కువగా తిన్న తర్వాత పెరుగు తినటం వల్ల ప్రత్యేకంగా సహాయపడుతుంది. రాత్రి సమయంలో మీ జీవక్రియ రేటు నెమ్మదిస్తుంది. కాబట్టి, పెరుగు మీ జీర్ణక్రియను సజావుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆమ్లత్వం, ఉబ్బరం, నిద్రలేమి సమస్యలను దూరం చేస్తుంది.

పెరుగులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తుంది. బరువును నియంత్రించుకోవడానికి ప్రయత్నించే వారికి పెరుగు సరైన ఎంపిక అవుతుంది.

పెరుగు రోగనిరోధక వ్యవస్థకు పునాది వేస్తుంది. రాత్రిపూట పెరుగు తినడం వల్ల మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మంచి బ్యాక్టీరియా నిరంతరం సరఫరా అవుతుంది. ఇది డీటాక్స్‌కు సహాయపడుతుంది. మరుసటి రోజుకు మిమ్మల్ని బాగా సిద్ధం చేస్తుంది.

పెరుగు వంటి పులియబెట్టిన పాల ఉత్పత్తులు చర్మ ఆరోగ్యంతో బాగా ముడిపడి ఉంటాయి. పెరుగులోని పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు రాత్రిపూట శరీరం సహజ పునరుత్పత్తి ప్రక్రియకు సహాయపడతాయి. అయితే, లాక్టిక్ ఆమ్లం విషాన్ని సున్నితంగా తొలగిస్తుంది. ఫలితంగా, చర్మ కణాలు లోపలి నుండి పోషణ పొందుతాయి. ఉదయం మీరు తాజాగా కనిపిస్తాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..