మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేస్తే చాలు.. మీ చర్మం మెరిసిపోవడం గ్యారెంటీ..
ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక కొత్త ట్రెండ్ వినిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన చిట్.. ఉప్పు నీటి స్నానం. సముద్రపు నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయని పూర్వీకులు చెబుతుండేవారు కానీ ఇప్పుడు అది ఒక గ్లామర్ సీక్రెట్‌గా మారిపోయింది. అసలు స్నానం చేసే నీటిలో ఉప్పు కలిపితే చర్మం ప్రకాశవంతంగా మారుతుందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉప్పు నీటి స్నానం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. నీటిలో కొంచెం ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఈ పద్ధతి నిజంగా ప్రయోజనకరమేనా? లేక చర్మానికి హాని చేస్తుందా? నిపుణులు ఏమంటున్నారు.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఉప్పు నీటి స్నానంతో కలిగే ప్రయోజనాలు
చర్మ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉప్పులో సహజంగానే బ్యాక్టీరియాను నియంత్రించే, శుభ్రపరిచే లక్షణాలు ఉన్నాయి. ఉప్పు నీరు చర్మంపై ఉన్న అదనపు నూనె, దుమ్ము, చెమటను సమర్థవంతంగా తొలగిస్తుంది. ఉప్పును గోరువెచ్చని నీటిలో కలిపినప్పుడు మెగ్నీషియం, కాల్షియం, సోడియం వంటి ఖనిజాలు చర్మ రంధ్రాల్లోకి వెళ్లి చర్మాన్ని ఉత్తేజితం చేస్తాయి. శరీరంపై మొటిమలు, దురద లేదా మంట ఉన్నవారికి ఉప్పు నీటి స్నానం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది కేవలం చర్మానికే కాదు మనసుకూ ప్రశాంతతను ఇస్తుంది. కండరాల నొప్పులను తగ్గించి ఒత్తిడిని దూరం చేస్తుంది.
అతిగా చేస్తే ప్రమాదమే
ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ప్రతిరోజూ ఉప్పు నీటితో స్నానం చేయడం ఏమాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ ఉప్పు నీటిని వాడటం వల్ల చర్మంలోని సహజ సిద్ధమైన తేమ కోల్పోయి, చర్మం పొడిగా, గరుకుగా మారుతుంది. అతిగా ఎక్స్‌ఫోలియేట్ అవ్వడం వల్ల చర్మంపై ఎర్రటి మచ్చలు లేదా చికాకు వచ్చే ప్రమాదం ఉంది. చాలా సెన్సిటివ్ చర్మం ఉన్నవారు, చర్మంపై గాయాలు లేదా కోతలు ఉన్నవారు ఈ పద్ధతికి దూరంగా ఉండాలి.
నిపుణుల సూచనలు
ఉప్పు నీటి స్నానం వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే చేయాలి. సాధారణ వంట ఉప్పు కంటే సముద్ర ఉప్పు లేదా ఎప్సమ్ సాల్ట్ వాడటం ఉత్తమం. స్నానం చేసిన వెంటనే చర్మంపై బాడీ ఆయిల్ లేదా మంచి మాయిశ్చరైజర్ రాయడం వల్ల తేమ లాక్ అవుతుంది.
సంపూర్ణ సౌందర్యం కోసం..
చర్మం అనేది మన శరీరంలోని అతిపెద్ద అవయవం. కేవలం పైన పూతలతోనే కాకుండా, లోపలి నుంచి కూడా దానిని రక్షించుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ఎండ ఉన్నా లేకపోయినా, ఏడాది పొడవునా సన్‌స్క్రీన్ వాడటం వల్ల ముడతలు, చర్మ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉంటూ తగినంత నీరు త్రాగడం, నిద్రపోవడం వల్ల చర్మం సహజంగానే ప్రకాశిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
