వీరికి పాలు విషంతో సమానం.. తాగక పోవడమే మంచిది!
పసి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిరోజూ పాలు అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు. ప్రతిరోజూ గ్లాసుడు పాలు తాగడం వల్ల శరీరానికి అవసరమైన అనేక పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పాలలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను బలోపేతం..

పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలిసిదే. పసి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిరోజూ పాలు అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు. ప్రతిరోజూ గ్లాసుడు పాలు తాగడం వల్ల శరీరానికి అవసరమైన అనేక పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పాలలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు దీనిలోని కార్బోహైడ్రేట్లు అలసటను తగ్గిస్తాయి. ఉదయం లేదా సాయంత్రం పాలు తాగడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ పాలు తాగడం కొంతమందికి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఎవరు పాలు తాగడం మంచిది కాదో నిపుణుల మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం..
పాలు ఎవరు తాగడం మంచిది కాదు?
లాక్టోస్ అలెర్జీ కారణంగా పాలు తాగడం కొంతమంది ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరిలో ఊబకాయం సమస్య పెరుగుతోంది. బరువు తగ్గాలనుకునే వారు రాత్రి పడుకునే ముందు పాలు తాగకూడదు. ఎందుకంటే శరీరం పాలలోని కొవ్వు, కేలరీలను గ్రహిస్తుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి ఇప్పటికే ఊబకాయంతో బాధపడుతున్న వారు రాత్రిపూట పాలు తాగకుండా ఉండటం మంచిది.
అంతే కాదు సైనస్, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కూడ రాత్రిపూట పాలు తాగకూడదు. ఎందుకంటే ఈ అలవాటు శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాదు, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు పాల వినియోగం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే వైద్యులు డయాబెటిక్ రోగులు రాత్రిపూట పాలు తాగకూడదని చెబుతుంటారు. పాలలోని లాక్టోస్ శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. గ్యాస్, అజీర్ణం, ఆమ్లత్వంతో బాధపడేవారు కూడ రాత్రిపూట పాలు తాగకూడదు. ఎందుకంటే ఇది ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




