AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shopping Tips: షాపింగ్ చేసేటప్పుడు ఈ 4 తప్పులను చేయకండి.. లేకుంటే మీ జేబు ఖాళీయే.. ఇలా డబ్బు ఆదా చేసుకోండి

ప్రతి ఒక్కరూ షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. దగ్గర తగినంత డబ్బు ఉంటే మాల్‌లో ఖర్చు చేయడానికి అభ్యంతరం ఉండదు. కానీ తక్కువ డబ్బుతో పొదుపుగా షాపింగ్ చేయడం..

Shopping Tips: షాపింగ్ చేసేటప్పుడు ఈ 4 తప్పులను చేయకండి.. లేకుంటే మీ జేబు ఖాళీయే.. ఇలా డబ్బు ఆదా చేసుకోండి
Shopping Tips
Subhash Goud
|

Updated on: Dec 19, 2022 | 5:27 PM

Share

ప్రతి ఒక్కరూ షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. దగ్గర తగినంత డబ్బు ఉంటే మాల్‌లో ఖర్చు చేయడానికి అభ్యంతరం ఉండదు. కానీ తక్కువ డబ్బుతో పొదుపుగా షాపింగ్ చేయడం నిజమైన ప్రతిభ. చాలా మంది షాపింగ్ సమయంలో ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు. దాని వల్ల వారి జేబు ఖాళీ అవుతుంటుంది. నెల బడ్జెట్ పూర్తిగా ఖాళీ అయిపోతుంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు షాపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ముఖ్యమైన షాపింగ్ చిట్కాలను తెలుసుకోవడం వల్ల డబ్బును ఆదా చేసుకోవచ్చు. మీరు వాటిని పాటిస్తే తక్కువ డబ్బుతో షాపింగ్ చేసుకోవచ్చు.

ఇలా షాపింగ్‌లో డబ్బు ఆదా చేసుకోండి

హడావుడిగా షాపింగ్ చేయకండి. తీరికగా ఓపికగా షాపింగ్ చేస్తే ఏది కొనాలి, ఏది కొనకూడదు అని ఆలోచించగలుగుతారు. ఇలా చేయడం వల్ల అవసరమైన వస్తువులనే కొనుగోలు చేస్తారు. షాపింగ్‌కు వెళ్లే ముందు లిస్ట్ తయారు చేయకుండా షాపింగ్ చేయకండి. ఇంటి నుండి బయటకు వెళ్ళే ముందు మీ వద్ద వస్తువుల జాబితా ఉందా లేదా అని తనిఖీ చేయండి. ఇది చాలా ముఖ్యం. ముందస్తు జాబితాను సిద్ధం చేసుకోవడం వల్ల మీ డబ్బు ఆదా అవుతుంది. ఎందుకంటే మీరు మార్కెట్‌లో జాబితా వెలుపల పనికిరాని వస్తువులను కొనుగోలు చేయకుండా డబ్బును ఆదా చేసుకుంటారు.

మీరు కొన్ని వస్తువులను మార్కెట్లో చూడగానే వెంటనే కొనాలని భావిస్తుంటారు. ఈ అలవాటు మీ నెలవారీ బడ్జెట్‌ను పాడు చేస్తుంది. మాల్స్‌లోని దుకాణదారులు అలాంటి వస్తువులను తమ ముందు అలంకరిస్తుంటారు. తద్వారా కస్టమర్లు వాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. అలా కాకుండా మీరు ఇప్పటికే నిర్ణయించిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయడం మంచిది.

ఇవి కూడా చదవండి

షాపింగ్ చేసే ముందు ఇంట్లో చెక్ చేసుకోండి

మీరు బట్టలు గానీ, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తున్నా షాపింగ్‌కు వెళ్లే ముందు ఫ్రిజ్, స్టోర్, డ్రాయర్, అల్మారా తనిఖీ చేయండి. లేకపోతే ఇంట్లో ఇప్పటికే ఉన్న వస్తువులను మీరు మళ్లీ కొనుగోలు చేస్తే డబ్బు వృధా అవుతుంది. దీని వల్ల అసలైన వస్తువులను కొనుగోలు చేయకుండా అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఛీ.. వ్యాక్ఈ వీడియో చూస్తే.. మళ్లీ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లరు
ఛీ.. వ్యాక్ఈ వీడియో చూస్తే.. మళ్లీ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లరు
పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?