IRCTC tour package: కశ్మీర్ అందాలను చూడాలా..? ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ..!

|

Oct 09, 2024 | 6:30 PM

వివిధ చారిత్రక ప్రదేశాల్లో పర్యటించాలని, అక్కడి వింతలు, విశేషాలను తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. కుటుంబంతోనో, స్నేహితులతో కలిసి పర్యటనలు చేయడం వల్ల పని ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ఎప్పుడూ పని మీదే కాకుండా మనసుకు నచ్చిన ప్రాంతాలలో పర్యటించడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి.

IRCTC tour package: కశ్మీర్ అందాలను చూడాలా..? ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ..!
Irctc Tour Packages
Follow us on

వివిధ చారిత్రక ప్రదేశాల్లో పర్యటించాలని, అక్కడి వింతలు, విశేషాలను తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. కుటుంబంతోనో, స్నేహితులతో కలిసి పర్యటనలు చేయడం వల్ల పని ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ఎప్పుడూ పని మీదే కాకుండా మనసుకు నచ్చిన ప్రాంతాలలో పర్యటించడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా మన దేశంలోని కాశ్మీర్ అందాలను చూడాలని చాలామంది భావిస్తారు. అక్కడి మంచుకొండల్లో విహరించాలని కోరుకుంటారు. కానీ ఎలా వెళ్లాలి, అక్కడ ఎలా ఉండాలో తెలియక వెనుకంజ వేస్తారు. ఇలాంటి వారికి ఐఆర్సీటీసీ శుభవార్త చెప్పింది. వివిధ ప్రాంతాలకు టూరిజం ప్యాకేజీలు అందజేసే ఈ సంస్థ ఇప్పుడు మిస్టికల్ కాశ్మీర్ వింటర్ స్పెషల్ అనే ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.

పర్యటన వివరాలు

కాశ్మీరులో పర్యటించాలనుకునే వారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) అద్భుత ప్యాకేజీ ప్రకటించింది. మిస్టికల్ కాశ్మీర్ వింటర్ స్పెషల్ అనే పేరుతో శ్రీనగర్, గుల్మార్గ్, సోన్ మార్గ్, పహల్గామ్ లలో పర్యటించవచ్చు. ఈ ప్యాకేజీ ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు ఉంటుంది. దీని ధర రూ.41,050గా నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి పర్యటన మొదలవుతుంది. నవంబర్ 7, 21, డిసెంబర్ 21, 27 తేదీలలో ఈ టూర్ ఉంటుంది. దానికి అనుగుణంగా వీలును బట్టి టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.

టిక్కెట్లు బుక్ చేసుకోండిలా..

కశ్మీరు అందాలను చూడాలనుకునే వారికి ఐఆర్సీటీసీ ఈ కొత్త ప్యాకేజీతో ఆహ్వానం పలుకుతోంది. ఈ మేరకు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో లింక్ పోస్టు చేసింది. ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఆనందంగా మంచు కొండలను ఆస్వాదించాలని కోరింది. ఆసక్తి కలవారు ఐఆర్టీసీటీటూరిజం.కామ్ లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరో ప్యాకేజీ

దేవభూమి అయిన ఉత్తరాఖండ్ కు ప్రత్యేకత అందరికీ తెలిసిందే. ఇక్కడి పవిత్ర ప్రాంతాలను సందర్శించే అవకాశాన్ని ఐఆర్సీటీసీ కల్పించింది. దీనికి కూడా ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందజేస్తోంది. ఈ మేరకు ఎక్స్ లో ప్యాకేజీ గురించి పోస్ట్ చేసింది. కోల్ కతా నుంచి టూర్ ప్రారంభమవుతుంది. ఇది పది రాత్రులు, 11 రోజుల పాటు ఉండే ప్యాకేజీ ఇది. తనక్ పూర్, చంపావత్, లోహాఘాట్, చౌకోరి, అల్మోరా, నైనిటాల్, భీమ్ తాల్ ను సందర్శించవచ్చు. ఒక్కొక్కరికీ రూ.37,220 ఖర్చవుతుంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఆర్సీటీసీటూరిజం.కమ్ /భారత్ గౌరవ్ లో ప్యాకేజీని బుక్ చేసుకునే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

దేఖో అప్నా దేశ్

దేశంలోని వివిధ పర్యాటన ప్రాంతాలను సందర్శించడానికి దేఖో అప్నా దేశ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానిలో భాగంగా ఈ టూర్ ప్యాకేజీలు నిర్వహిస్తున్నారు. 2020లో పర్యాటక మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించింది.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..