Lifestyle: కడుపు బాగుంటేనే మనసు బాగుంటుంది.. పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు..
ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఉదర సంబంధిత వ్యాధలే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కడుపు సంబంధిత సమస్యలతో కేవలం శారీరక సమస్యలే కాకుండా మానసిక సమస్యలు కూడా తప్పవని నిపుణులు చెబుతున్నారు. కడుపు సంబంధిత సమస్యలు మెదడుపై కూడా ప్రభావం చూపుతాయని అంటున్నారు...
ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఉదర సంబంధిత వ్యాధలే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కడుపు సంబంధిత సమస్యలతో కేవలం శారీరక సమస్యలే కాకుండా మానసిక సమస్యలు కూడా తప్పవని నిపుణులు చెబుతున్నారు. కడుపు సంబంధిత సమస్యలు మెదడుపై కూడా ప్రభావం చూపుతాయని అంటున్నారు. కడుపు ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి మధ్య సంబంధం ఏంటనేగా మీ సందేహం. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
పేగుల్లో ఉండే మంచి, చెడు బ్యాక్టీరియాలు పేగు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. పేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే.. అది మెదడు కణాలపై చెడు ప్రభావాన్ని చూపుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ‘హార్వర్డ్ హెల్త్’ నివేదిక ప్రకారం పేగులకు మన మెదడుతో ప్రత్యక్ష సంబంధం ఉందని, పేగుల్లో తలెత్తే సమస్యలు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయని నిపుణలు చెబుతున్నారు.
అయితే ఇంతకీ అసలు కడపు, మెదడు మధ్య సంబంధం ఏంటనే సందేహం రావడం సర్వసాధారణం. పేగుల్లో ఏదైనా సమస్య ఉంటే అది మెదడుపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం, పేగు ఆరోగ్యం ఒకదానికి మరొదానికి మధ్య లోతైన సంబంధం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు, గట్ ఆరోగ్యం నిరంతరం నరాలు, రసాయన సంకేతాల ద్వారా కమ్యూనికేట్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా పేగుల్లో ఉండే ఈ గట్ బ్యాక్టీరియా మైక్రోబయోటా, సెరోటోనిన్వంటి న్యూరోట్రాన్స్మిటర్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి మానసిక స్థితితో పాటు, భావోద్వేగాలను నియంత్రిస్తాయి. గట్ మైక్రోబయోటాలో అసమతుల్యత ఈ కమ్యూనికేషన్‌కు అంతరాయం కలిగిస్తుంది. దీంతో ఇది మానసిక ఆరోగ్య రుగ్మతలకు దారితీస్తుందని అంటున్నారు. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) సమస్య ఉన్న వ్యక్తులు ఆందోళన, నిరాశతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..