వామ్మో.. ఖరీదైన కుంకుమ పువ్వు కాస్తంత చాలు.. అతిగా తిన్నారంటే అంతే సంగతులు..!

ఇతర మసాలా దినుసుల కంటే కుంకుమపువ్వు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువ. మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుందని, డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది. కానీ, కుంకుమపువ్వు ఎక్కువగా తింటే అది మీ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని మీకు తెలుసా..? అవేంటో కూడా తప్పక తెలుసుకోవాలి.

వామ్మో.. ఖరీదైన కుంకుమ పువ్వు కాస్తంత చాలు.. అతిగా తిన్నారంటే అంతే సంగతులు..!
Much Saffron

Updated on: Nov 19, 2025 | 9:51 PM

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా దినుసు కుంకుమపువ్వు. ఈ పువ్వు రేకులు ఉత్పత్తి చేసే విధానం కారణంగానే ఈ కుంకుమపువ్వు ధర అత్యధికంగా ఉంటుంది. అంతేకాదు..ఇతర మసాలా దినుసుల కంటే కుంకుమపువ్వు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువ. మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుందని, డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది. కానీ, కుంకుమపువ్వు ఎక్కువగా తింటే అది మీ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని మీకు తెలుసా..? అవేంటో కూడా తప్పక తెలుసుకోవాలి.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు కుంకుమపువ్వును ఎక్కువగా ఉపయోగిస్తే మీ చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి. కుంకుమపువ్వులో క్యాల్షియం, విటమిన్ ఇ, విటమిన్ సి, ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇది ఆహారం రుచి, వాసనను పెంచుతుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. కుంకుమపువ్వును అధికంగా తీసుకోవడం వల్ల మీ రక్తపోటు తగ్గుతుంది. ఈ తీవ్రమైన సమస్యను నివారించడానికి మీరు తక్కువ కుంకుమపువ్వు తినాలి.

కుంకుమపువ్వు అధికంగా తీసుకోవడం వల్ల బైపోలార్ డిజార్డర్ వచ్చే ప్రమాదం ఉందని చాలా పరిశోధన ఫలితాలు వెల్లడించాయి. కుంకుమపువ్వును ఎక్కువగా వాడటం వల్ల శరీరంలోని యాంటిజెన్లను ప్రోత్సహిస్తుంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. కుంకుమపువ్వును ఎక్కువగా వాడటం వల్ల ముక్కు నుండి రక్తం కారుతుంది. కనురెప్పలు, పెదవులు మొద్దుబారిపోతాయి. అందుకే తక్కువ పరిమాణంలో తినాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…