Child Care: నాన్నలూ.. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం లేదా.? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

|

Jun 25, 2022 | 11:39 AM

Research: పిల్లలపై పేరెంట్స్‌ ప్రభావం ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీన్స్‌ పరంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలు కొన్ని లక్షణాలను పునికి పుచ్చుకుంటారు. అయితే పుట్టుకతో వచ్చే లక్షణాలు కొన్నైతే పెంపకంతో కూడా...

Child Care: నాన్నలూ.. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం లేదా.? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
Follow us on

Research: పిల్లలపై పేరెంట్స్‌ ప్రభావం ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీన్స్‌ పరంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలు కొన్ని లక్షణాలను పునికి పుచ్చుకుంటారు. అయితే పుట్టుకతో వచ్చే లక్షణాలు కొన్నైతే పెంపకంతో కూడా కొన్ని లక్షణాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లలతో తండ్రి గడిపే సమయం వారి సామర్థ్యాలపై ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. చిన్నారులతో తండ్రి ఎక్కువ సమయం గడుపుతూ, వారితో మాట్లాడుతూ, ఆడుకోవడం లాంటివి చేస్తే.. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, మెరుగైన విశ్లేషణ సామర్థ్యం కూడా మెరుగవుతుందని చెబుతున్నారు. కాబట్టి తండ్రి కచ్చితంగా పిల్లలకు సమయాన్ని కేటాయించాలని సూచిస్తున్నారు.

ఇక బిడ్డ ఆరోగ్యంపై కూడా తండ్రి ప్రభావమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీర్యం నాణ్యత బాగుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని పరిశోధనల్లో వెల్లడైంది. ఎలాగైతే మహిళల వయసు పెరిగితే గర్భధారణ ఆలస్యమవుతుందో, అలాగే 40 ఏళ్లు నిండిన పురుషులు పిల్లల కోసం ప్లాన్‌ చేసుకుంటే ఆ సమయంలో పుట్టే పిల్లలకు ఆటిజం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పొగతాగే పురుషుల్లో వీర్య నాణ్యత తగ్గుతుందని, పొగ తాగే అలవాటున్న వారి పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. తండ్రి మానసిక ఆరోగ్యం కూడా పిల్లలపై ఉంటుందని పరిశోధనల్లో తేలింది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..