Skin Care: మోకాళ్లు, మోచేతులపై ఉండే నలుపును ఇలా తగ్గించుకోండి..

| Edited By: Ram Naramaneni

Jul 21, 2024 | 7:48 PM

ఆడవాళ్లు ఏంటి.. మగవాళ్లు కూడా అందంగా కనిపించే విషయంలో ఏమాత్రం రాజీ పడరు. హెయిర్ స్టైల్ దగ్గర నుంచి కాళ్లకు వేసుకునే చెప్పుల విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. అందరిలో ఎట్రాక్షన్‌గా నిలవాలని అనుకుంటారు. అయితే శరీరం అంతా ఒక రంగులో ఉంటే.. మోకాళ్లు, మోచేతులు మాత్రం డార్క్‌ కలర్‌లో కనిపిస్తూ ఉంటాయి. టీ షర్టుల, షార్ట్స్ ధరించినప్పుడు ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇంట్లో ఉండే కొన్ని రకాల సింపుల్..

Skin Care: మోకాళ్లు, మోచేతులపై ఉండే నలుపును ఇలా తగ్గించుకోండి..
Skin Care
Follow us on

ఆడవాళ్లు ఏంటి.. మగవాళ్లు కూడా అందంగా కనిపించే విషయంలో ఏమాత్రం రాజీ పడరు. హెయిర్ స్టైల్ దగ్గర నుంచి కాళ్లకు వేసుకునే చెప్పుల విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. అందరిలో ఎట్రాక్షన్‌గా నిలవాలని అనుకుంటారు. అయితే శరీరం అంతా ఒక రంగులో ఉంటే.. మోకాళ్లు, మోచేతులు మాత్రం డార్క్‌ కలర్‌లో కనిపిస్తూ ఉంటాయి. టీ షర్టుల, షార్ట్స్ ధరించినప్పుడు ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇంట్లో ఉండే కొన్ని రకాల సింపుల్ టిప్స్‌తో మీరు ఈజీగా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చెప్పే హోమ్ మేడ్ క్రీమ్ ఒకటి ట్రై చేయండి. మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి.

నల్లగా ఉండటానికి కారణం ఇదే:

మోకాళ్లు, మోచేతులు నల్లగా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. డెడ్ స్కిన్ సెల్స్, హార్మోన్ల ప్రభావం, కొన్ని రకాల చర్మ సమస్యలు, సరైన కేర్ తీసుకోకపోవడం, సూర్య రశ్మి ప్రభావం వల్ల నల్లగా ఉంటాయి.

సన్ స్క్రీన్:

కేవలం ముఖానికి మాత్రమే కాకండా మో చేతులు, మోకాళ్లు కూడా సన్ స్క్రీన్ అప్లై చేస్తూ ఉండాలి. అలాగే వీలైనప్పుడల్లా రోజ్ వాటర్‌ అప్లై చేస్తూ ఉండండి. తడి క్లాత్‌తో తుడుస్తూ ఉంటే.. నలుపు తగ్గుతూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

హోమ్ మేడ్ క్రీమ్ తయారీ:

మోచేతులు, మోకాళ్లపై ఉండే నలుపును పోగొట్టేందుకు కొబ్బరి నూనె, వాల్ నెట్ పొడి కావాలి. ఈ రెండింటినీ సమానైన పరిమాణంలో తీసుకోండి. ఈ రెండూ బాగా కలిపితే ఒక క్రీమ్ తయారవుతుంది. ఇప్పుడు ఈ క్రీమ్ మోచేతులు, మోకాళ్లపై తరచూ అప్లై చేసి మర్దనా చేయాలి. ఐదు నిమిషాల తర్వాత స్నానం చేయాలి. మీరు స్నానం చేసే ముందు కూడా ఇలా చేయవచ్చు. తరచూ ఇలా చేయడం వల్ల మోచేతులు, మోకాళ్లపై ఉండే ట్యాన్ పోతుంది. రాత్రి పడుకునే ముందు కూడా అప్లై చేయవచ్చు. పొడిబారడం కూడా తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..