ఎండాకాలం అప్పుడే మండిపోతుంది. ఉదయం 10దాటితే చాలు మాడు పగిలిపోయే ఎండ దంచికొడుతుంది. దాంతో ఒంట్లో వేడి కూడా పెరిగిపోతుంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక ప్రజలు, శీతల పానీయాలు, కొబ్బరి బోండాలు, లెమన్ వాటర్, పుదీనా నీరు, మజ్జిగ వంటివి తరచూగా తీసుకుంటుంటారు.. అయితే, వేసవిలో చలువ చేసే మరో పదార్థం కూడా ఉంది. అదే సబ్జా గింజల పానీయం. ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు, ఎక్కువ మంది సబ్జా గింజలను నానబెట్టుకుని వాటిలో కలకండా వేసుకుని తాగేవారు. ఇప్పుడు చాలా మంది దాన్ని మరిపోయారు. కానీ ఈ వేసవిలో మన ఒంటికి చలవ చేసే పానీయాల్లో సబ్జా చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో మన శరీరానికి హైడ్రేటెడ్ గా, చల్లగా ఉండాల్సిన అవసరం కూడా పెరుగుతోంది. వేసవిలో మన ఆరోగ్యం, శరీరం హైడ్రేటింగ్ యాంటీఆక్సిడెంట్-రిచ్ సీజనల్ పండ్లను తీసుకోవడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన కొన్ని విత్తనాలను తీసుకోవడం వల్ల కూడా మీ శరీరాన్ని చల్లబరుస్తుంది. అటువంటి విత్తనం సబ్జా లేదా తులసి గింజలు, వీటిని సాధారణంగా ఫలూడా గింజలు అని పిలుస్తారు. ఈ విత్తనాల్లో ప్రోటీన్లు, కీలకమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉన్నాయని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మాత్రమే కాకుండా సబ్జా గింజల్లో ఉండే ప్రోటీన్ కంటెంట్ చియా విత్తనాల కంటే ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు లేని కారణంగా వాటిని ఆసియన్ సూపర్‌ఫుడ్ గా కూడా పరిగణిస్తున్నారు.
ఈ గింజల్లో పీచు, శ్లేష్మం పుష్కలంగా ఉన్నందున, అవి “మలబద్ధకాన్ని తగ్గించడంలో ప్రేగు కదలికను ప్రోత్సహించడం, సంతృప్తిని కలిగించడం, మూత్రవిసర్జన (UTIకి అద్భుతమైనది), మూత్రపిండాలను నిర్విషీకరణ చేయడం, పిండిని రక్తంలో చక్కెరగా మార్చడం ద్వారా బరువు తగ్గడంలో చాలా సహాయకారిగా పనిచేస్తాయి. సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి. ఫలితంగా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
చక్కెర వేయకుండా అలాగే సబ్జా గింజల నీటిని తాగితే మధుమేహం అదుపులోకి వస్తుంది. సబ్జా గింజలు రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. చర్మం, కేశ సంరక్షణలో కూడా ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. తులసి గింజలు చర్మం, జుట్టుకు మంచివి. UTIలో చాలా సహాయకారిగా ఉంటుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వికారంగా, వాంతి వచ్చే విధంగా ఉంటే సబ్జా గింజల పానీయం తాగడం మంచిది. గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.
పిల్లలు, గర్భిణీ స్త్రీలు నిపుణుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే తులసి గింజలు శరీరంలోని ఈస్ట్రోజెన్ స్థాయిని తగ్గిస్తాయి. గర్భిణీ స్త్రీలు తమ ఆహారంలో దీనిని చేర్చుకునే ముందు తప్పనిసరిగా తమ వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. విత్తనాలు బాగా నానకపోతే, చిన్నపిల్లలకు అవస్థ కలుగుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..