Raw Milk: 1 టేబుల్ స్పూన్ పచ్చి పాలను ముఖానికి ఇలా పట్టిస్తే సూపర్ ప్రయోజనాలు.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..

|

Nov 04, 2022 | 6:54 AM

చాలా మంది తమ చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో లభించే కాస్మెటిక్ ఉత్పత్తులపై ఆధారపడుతుంది. అయితే, వంటగదిలో ఉంచిన పచ్చి పాలు కూడా...

Raw Milk: 1 టేబుల్ స్పూన్ పచ్చి పాలను ముఖానికి ఇలా పట్టిస్తే సూపర్ ప్రయోజనాలు.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..
Milk Facepack
Follow us on

చాలా మంది తమ చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో లభించే కాస్మెటిక్ ఉత్పత్తులపై ఆధారపడుతుంది. అయితే, వంటగదిలో ఉంచిన పచ్చి పాలు కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పచ్చి పాలతో ఫేస్ ప్యాక్ చేసుకుంటే.. అందమైన ముఖవర్ఛస్సు మీ సొంతం అవుతుంది. ఒక టీ స్పూన్ పచ్చి పాలను క్రమం తప్పకుండా వాడటం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతిరోజూ ముఖానికి పచ్చి పాలను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

పచ్చి పాలు వల్ల కలిగే ప్రయోజనాలు..

1. పచ్చి పాలలో ప్రొటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తుంది. పచ్చి పాలలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు.

2. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ మంచి మూలం. పచ్చి పాలు చర్మాన్ని బిగుతుగా ఉంచుతాయి. చర్మం టానింగ్‌ని తగ్గించి, ముఖాన్ని కాంతివంతంగా మార్చుతాయి.

ఇవి కూడా చదవండి

3. మిల్క్ టోనర్: ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత పచ్చి పాలతో మీ ముఖాన్ని క్రమం తప్పకుండా కడగాలి. నిజానికి రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు చర్మం డీహైడ్రేట్ అయి పొడిబారుతుంది. పాలతో ముఖాన్ని టోన్ చేయడం వల్ల పొడి చర్మం నుండి బయటపడవచ్చు. ఇది చర్మ రంధ్రాలను బిగుతుగా చేసి చర్మం కుంగిపోయే సమస్యను తగ్గిస్తుంది. పచ్చి పాలతో ఫేషియల్ టోనింగ్ చేయడం వల్ల ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ పొర తొలగిపోతుంది.

4. పచ్చి పాలతో చర్మాన్ని మసాజ్ చేయాలి: పచ్చి పాలలో దూదిని ముంచి ముఖానికి పట్టించాలి. దానితో ముఖాన్ని మసాజ్ చేయాలి. కళ్ల చుట్టూ అప్లై చేసుకోవాలి. ఇది చర్మాన్ని లోతుగా మాయిశ్చరైజ్ చేస్తుంది. ముఖంపై నల్ల మచ్చలను తొలగించి, ముఖాన్ని కాంతివంతం చేస్తుంది. ఇది చర్మం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా ముఖఛాయను కాంతివంతంగా చేస్తుంది. రోజుకు ఒకసారి పచ్చి పాలతో ముఖానికి మసాజ్ చేస్తే ప్రయోజనం ఉంటుంది.

5. పచ్చి పాలతో చర్మాన్ని రుద్దాలి: పచ్చి పాలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇది నేచురల్ ఎక్స్‌ఫోలియేటర్. దీనిని ఓట్స్‌తో కలిపి ముఖానికి నేరుగా రాసుకోవచ్చు. ఇది ముఖాన్ని బాగా స్క్రబ్ చేసి చర్మ రంధ్రాలలో దాగి ఉన్న మురికిని శుభ్రపరుస్తుంది.

6. పచ్చి పాల ఫేస్ ప్యాక్: పచ్చి పాల నుంచి కూడా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. పచ్చి పాలలో శెనగ పిండి, తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 10 నుండి 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఈ హోంమేడ్ ఫేస్ ప్యాక్ ను రెగ్యులర్ గా అప్లై చేస్తే చర్మం మెరిసిపోవడంతో పాటు ముఖంపై ఉన్న మచ్చలు కూడా తేలిపోతాయి.

7. గమనిక: జిడ్డు చర్మం ఉన్నట్లయితే పచ్చి పాలను ముఖానికి అస్సలు రాసుకోకూడదు. వీరు పెరుగును ముఖానికి రాసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..