AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రధాని మోదీకి ఇష్టమైన కూరగాయతో ఈ 15 వ్యాధులకు చెక్.. ఏంటో తెలుసా..?

ప్రధాని మోదీకి బాగా నచ్చిన కూరగాయ ఎన్నో వ్యాధులకు దివ్య ఔషధమని మీకు తెలుసా..? దీన్ని పోషక విలువల గురించి మాట్లాడుకుంటే.. ఇది విటమిన్లు A, B1, B2, C, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్ వంటి వాటికి మంచి మూలం.

PM Modi: ప్రధాని మోదీకి ఇష్టమైన కూరగాయతో ఈ 15 వ్యాధులకు చెక్.. ఏంటో తెలుసా..?
Pm Modi Diet Secret Is Moringa Paratha
Krishna S
|

Updated on: Sep 17, 2025 | 5:55 PM

Share

ప్రధాని మోదీ తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన ఆరోగ్యం, ఫిట్‌నెస్ గురించి మరోసారి చర్చ మొదలైంది. మోదీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఆయన తినే ఆహారమేనని చాలా మంది నమ్ముతారు. మోదీ ఇష్టంగా తినే ఆహారం గురించి చాలామందికి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. ఆయనకు అనేక రకాల ఆహారాలు ఇష్టమే అయినా.. మునగాకు పరాఠా అంటే ఆయనకు చాలా ఇష్టం. వారానికి రెండు లేదా మూడు సార్లు దీన్ని తింటానని గతంలో మోదీ చెప్పారు. దీన్నివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మునగతో అద్భుతమైన ప్రయోజనాలు

పోషక విలువలు:

దక్షిణ భారతదేశంలో మునగకాయను ఎక్కువగా వాడుతుంటారు. దీన్ని సాంబార్, సూప్‌లలో కూడా వేస్తారు. మునగలో యాంటీఆక్సిడెంట్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్లు (A, B1, B2, C), కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

వాపు తగ్గించడంలో సహాయం:

శరీరంలోని కణజాలాల్లో నీరు చేరితే వచ్చే వాపును ‘ఎడెమా’ అంటారు. ఒక అధ్యయనం ప్రకారం.. మునగ గింజల నూనె వాపును తగ్గిస్తుంది. అలాగే ఇది కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని ఆకులు పెద్దపేగు క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయి.

కాలేయ సంబంధిత సమస్యలకు:

మునగకాయ నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యను నివారిస్తుంది. ఇది కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోకుండా తగ్గిస్తుంది. జంతువులపై చేసిన అధ్యయనాలలో మునగ సారం వాపును తగ్గించడంలో సహాయపడుతుందని తేలింది.

క్యాన్సర్ కణాలు నాశనం:

మునగలో ఉండే ఒక పదార్థం క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం.. మునగ చెట్టు ఆకులు, బెరడు, ఇతర భాగాలకు క్యాన్సర్ కణాలను చంపే శక్తి ఉందని తేలింది.

గుండె ఆరోగ్యానికి:

మునగలో ఉండే క్వెర్సెటిన్ అనే పదార్థం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్, వాపును తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మునగలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు నాడీ సంబంధిత వ్యాధులైన అల్జీమర్,స్ డిప్రెషన్ వంటి వాటి నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి.

డయాబెటిక్ రోగులకు:

మునగ ఆకు సారం షుగర్, ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే దీని ప్రభావాలు స్వల్పంగా ఉంటాయని ఇటీవల ఒక అధ్యయనంలో వెల్లడైంది.

మరికొన్ని ప్రయోజనాలు:

మునగలోని పదార్థాలు ఆస్తమా, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే బీటా-కెరోటిన్ కంటి ఆరోగ్యానికి మంచిది. మునగను రక్తహీనత, సికిల్ సెల్ వ్యాధికి చికిత్సగా ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..