AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tours: అమేజింగ్‌ అండమాన్‌ దీవులను చుట్టేసి వద్దాం రండి.. హైదరాబాద్‌ నుంచి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ.. వివరాలు ఇవి..

ఇటీవల కాలంలో ఐఆర్‌సీటీసీ మన దేశంలోని ప్రముఖ, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలతో పాటు ప్రపంచ వ్యా‍ప్తంగా పలు టూరిస్ట్‌ స్పాట్లకు ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా అండమాన్‌ నికోబార్‌ దీవులకు కూడా ఓ ప్యాకేజీని అందిస్తోంది. అమేజింగ్ అండమాన్ ఎక్స్ హైదరాబాద్ పేరిట శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి విమానంలో దీవులను చూపించి తీసుకొచ్చే విధంగా ఈ ప్యాకేజీని రూపొందించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

IRCTC Tours: అమేజింగ్‌ అండమాన్‌ దీవులను చుట్టేసి వద్దాం రండి.. హైదరాబాద్‌ నుంచి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ.. వివరాలు ఇవి..
Andaman Islands
Follow us
Madhu

|

Updated on: Aug 08, 2023 | 6:00 PM

సముద్ర తీర ప్రాంతాలను బాగా ఇష్టపడతారా? చుట్టూ నీరు, మధ్యలో ఇసుక తెన్నెలతో పచ్చదనంతో అలరారుతుండే లోకేషన్లంటే ఆసక్తా? అయితే మీరు అండమాన్‌ నికోబార్‌ దీవులను ఒక్కసారైనా చుట్టేసి రావాల్సిందే. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇసుక బీచ్లు, రుచికరమైన రెస్టారెండ్లు, వాటర్‌ స్పోర్ట్స్‌ యాక్టివిటీస్‌ మిమ్మిల్ని కట్టిపడేస్తాయి. ఇది గ్లోబల్‌ వైడ్‌గా బెస్ట్‌ టూరిస్ట్‌ డెస్టినేషన్‌గా రూపాంతరం చెందింది. ఒకవేళ మీరు కూడా అక్కడికి వెళ్లాలనుకుంటే ఎలా? చాలా ప్రైవేటు టూరిస్ట్‌ ఏజెన్సీలు ఉన్నప్పటికీ, అధిక భద్రతతో పాటు తక్కువ ధరకే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఆర్ సీటీసీ) బెస్ట్‌ప్యాకేజీలను అందిస్తోంది. ఇటీవల కాలంలో ఐఆర్‌సీటీసీ మన దేశంలోని ప్రముఖ, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలతో పాటు ప్రపంచ వ్యా‍ప్తంగా పలు టూరిస్ట్‌ స్పాట్లకు ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా అండమాన్‌ నికోబార్‌ దీవులకు కూడా ఓ ప్యాకేజీని అందిస్తోంది. అమేజింగ్ అండమాన్ ఎక్స్ హైదరాబాద్ పేరిట శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి విమానంలో దీవులను చూపించి తీసుకొచ్చే విధంగా ఈ ప్యాకేజీని రూపొందించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇది అండమాన్‌ టూర్‌ వివరాలు..

ఐఆర్సీటీసీ ప్యాకేజీ పేరు: అమేజింగ్ అండమాన్ ఎక్స్ హైదరాబాద్ (ఎస్‌హెచ్‌ఏ18)

వ్యవధి: 5 రాత్రులు/6 రోజులు

ఇవి కూడా చదవండి

ప్రయాణ సాధనం: విమానం

టూర్‌ తేదీలు: 2023, ఆగస్టు 18, సెప్టెంబర్‌ 9

సందర్శించే ప్రాంతాలు: పోర్ట్ బ్లెయిర్, హేవ్‌లాక్ ఐలాండ్, నీల్ ఐలాండ్, రాస్ అండ్‌ నార్త్ బే ఐలాండ్

టూర్‌ సాగేదిలా..

డే1(హైదరాబాద్-పోర్ట్ బ్లెయిర్): హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 5.35 గంటలకు విమానం టేక్‌ ఆఫ్‌ అవుతుంది. పోర్ట్‌ బ్లెయర్‌ కి చేరుకొన్నాక అక్కడి ఐఆర్‌సీటీసీ ప్రతినిధి మిమ్మల్ని ఆహ్వానించి హోటల్‌కు తీసుకెళ్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత పోర్ట్ బ్లెయిర్ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత సుందరమైన, కొబ్బరి తాటి అంచుగల బీచ్‌లలో ఒకటైన కోర్బిన్స్ కోవ్ బీచ్‌కి వెళ్తారు. తర్వాత అక్కడ ఉన్న సెల్యులార్ జైలు మ్యూజియాన్ని సందర్శిస్తారు. దాని చరిత్రపై లైట్ అండ్‌ సౌండ్ షో ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్‌లోనే రాత్రి బస చేస్తారు.

డే2(రాస్ అండ్‌ నార్త్ బే ఐలాండ్‌): అల్పాహారం తర్వాత రాస్ ఐలాండ్‌కి వెళ్తారు. ఈ ద్వీపం అన్ని రకాల వాటర్ స్పోర్ట్స్ కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది. స్కూబా డైవింగ్, చిన్న జలాంతర్గామి రైడ్ లేదా గ్లాస్ బాటమ్ బోట్ రైడ్ కోసం వెళ్లవచ్చు. సముద్రగర్భ పగడాలు, సముద్ర జీవులను చూడవచ్చు. రాత్రికి పోర్ట్‌ బ్లెయర్‌లోనే బస చ ఏస్తారు.

డే3(పోర్ట్ బ్లెయిర్- హేవ్‌లాక్): పోర్ట్‌ బ్లెయర్‌కు టాటా చెప్పిహావ్‌ లాక్‌ కి పయనమవుతారు. కాలాపత్తర్ & రాధానగర్ బీచ్ సందర్శిస్తారు. ఆసియాలోని అత్యంత పరిశుభ్రమైన ఈ బీచ్‌ని ఆస్వాదించవచ్చు. రాత్రికి అక్కడే హోటల్‌లో బస.

డే4 (హావ్‌లాక్ – నీల్ ఐలాండ్): అల్పాహారం తర్వాత హోటల్‌ చెక్ అవుట్ చేసి, నీల్ ద్వీపానికి బయలుదేరుతారు. అక్కడ భరత్‌పూర్ బీచ్, నేచురల్ బ్రిడ్జ్,లక్సంపూర్ బీచ్ సందర్శిస్తారు. నైట్ రిసార్ట్‌లో బస ఉంటుంది.

డే5(నీల్‌ ఐలాండ్‌- పోర్టు బ్లెయర్‌): హోటల్‌లో చెక అవుట్‌ చేసి క్రూజ్‌ టైమింగ్‌ప్రకారం హార్బర్‌ కు చేరుకుటారు. తిరిగి పోర్ట బ్లెయర్‌ కు చేరుకొని రాత్రి బస చేస్తారు.

డే6(పోర్ట్‌ బ్లెయర్‌ టు హైదరాబాద్‌): అల్పాహారం చేసి, విమానాశ్రయానికి చేరుకొని హైదరాబాద్‌ పయనమవుతారు.

ప్యాకేజీ ధరలు ఇలా..

అమేజింగ్‌ అండమాన్‌ టూర్‌ ప్యాకేజీలో ధరలు చూస్తే.. విమానంలో కంఫర్ట్‌ క్లాస్‌ మిమ్మల్ని తీసుకెళ్తారు. అందులో సింగిల్‌ ఆక్యుపెన్సీలో రూ. 58,440, డబుల్‌ షేరింగ్‌లో ఒక్కో వ్యక్తికి రూ. 45,830, ట్రిపుల్‌ షేరింగ్‌ లో ఒక్కో వ్యక్తికి రూ. 45,540 వసూలు చేస్తారు. అలాగే 5 నుంచి 11 పిల్లలకు ప్రత్యేక మంచం కావాలనుకొనే వారికి రూ. 41,255, అలాగే 2 నుంచి 11 సంవత్సరాలున్న పిల్లలకు బెడ్‌ సదుపాయం లేకుండా అయితే రూ. 37, 860 తీసుకుంటారు.

ప్యాకేజీలో కవర్‌ అయ్యేవి..

విమాన టిక్కెట్లు, అన్ని ప్రాంతాల్లో ఏసీ వసతి, లోకల్లో ఏసీ వాహనంలో ప్రయాణం, నీల్ ఐలాండ్, హేవ్‌లాక్ ఐలాండ్, రాస్ ఐలాండ్, నార్త్ బే ఐలాండ్ ఫెర్రీ ఛార్జీలు, ప్రతి రోజూ బ్రేక్‌ ఫాస్ట్‌లు, డిన్నర్లు అందిస్తారు. మధ్యాహ్నం భోజనం మాత్రం మనం చూసుకోవాలి. ఐఆర్‌ సీటీసీ నుంచి టూర్‌ ఎస్కార్ట్‌ ఇస్తారు. కొండచరియలు విరిగిపడటం, సమ్మె, కర్ఫ్యూ, ప్రమాదాలు, గాయాలు, ఆలస్యమైన లేదా రద్దయిన ఫ్లైట్ మొదలైన ఏవైనా అత్యవసర పరిస్థితులకు ఐఆర్‌సీటీసీ బాధ్యత వహించదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..