Yoga For Infertility: ఈ యోగా ముద్ర ఒక్కటి వేస్తే… సంతాన లేమి సమస్య తీరుతుంది!

యోగా ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. పూర్వం నుంచి కూడా అనేక అనారోగ్య సమస్యలన్ని తగ్గించడానికి యోగాను ఉపయోగించేవారు. యోగాతో ఎలాంటి సమస్యలను అయినా తగ్గించుకోవచ్చు. ఎలాంటి సమస్యలను తగ్గించడానికి అయినా యోగా చక్కగా సహాయ పడుతుంది. యోగా తరచూ చేయడం వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది. యోగా చేయడం వల్ల శరీరానికి నూతన ఉత్సాహం..

Yoga For Infertility: ఈ యోగా ముద్ర ఒక్కటి వేస్తే... సంతాన లేమి సమస్య తీరుతుంది!
Yoga For Infertility
Follow us

|

Updated on: Jun 10, 2024 | 2:05 PM

యోగా ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. పూర్వం నుంచి కూడా అనేక అనారోగ్య సమస్యలన్ని తగ్గించడానికి యోగాను ఉపయోగించేవారు. యోగాతో ఎలాంటి సమస్యలను అయినా తగ్గించుకోవచ్చు. ఎలాంటి సమస్యలను తగ్గించడానికి అయినా యోగా చక్కగా సహాయ పడుతుంది. యోగా తరచూ చేయడం వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది. యోగా చేయడం వల్ల శరీరానికి నూతన ఉత్సాహం కలుగుతుంది. ఒక్కో యోగా పోజ్ బట్టి మీ ఆరోగ్యంలో అనేక మార్పులు కొనసాగుతాయి. ఇలా యోగా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా యోగా వల్ల సంతానలేమి సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. సంతాన సమస్యలు తగ్గించుకోవడానికి యోగాలోని ఆపానా ముద్ర చక్కగా సహాయ పడుతుంది. మరి ఈ ముద్ర ఎలా వేయాలి? ఇంకా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆపానా ముద్ర ఎలా వేయాలి:

ఈ ముద్ర వేసేందుకు ముందు పద్మాసనంలో కూర్చోవాలి. రెండు చేతులను.. మీ కాలి తొడలపై ఉంచండి. బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు గుండ్రంగా ఉంచాలి. చిటికెన వేలు, చూపుడు వేలు చాచి ఉంచాలి. ఇప్పుడు డీప్ బ్రీత్ తీసుకుని.. 15 నుంచి 20 నిమిషాలు అలానే ఉండాలి. ఇలా ప్రతి రోజూ వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి:

ఈ ముద్ర ప్రతి రోజూ వేయడం వల్ల ఎమోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. సాధారణంగా ఆలోచనలు కంట్రోల్‌లో ఉండవు. కొందరు అయితే మరీ దూకుడుగా.. ఏది అనిపిస్తే అది వెంటనే చేసేస్తారు. ఇలా కాకుండా.. ఈ ఆసనం వేస్తే.. ఆలోచనలు, ఎమోషన్స్ అవేవి కంట్రోల్ అవుతూ ఉంటాయి.

ఇవి కూడా చదవండి

బాడీ డీటాక్స్ అవుతుంది:

ప్రతి రోజూ ఆపానా యోగా ముద్ర వేయడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది. బాడీలోని వ్యర్థ పదార్థాలు, మలినాలు దూరం అవుతాయి. దీని వల్ల మూత్ర నాళం అనేది క్లీన్ అవుతుంది.

సంతానోత్పత్తి:

పిల్లలు కలగడం లేని వాళ్లు, శరీరంలో పలు రకాల సమస్యలతో ఇబ్బంది పడేవారు తరచూ ఈ ముద్ర వేయడం వల్ల వీరిలో సంతానం కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ ముద్ర వేయడం వల్ల స్త్రీపురుషుల్లో పునరుత్పత్తి మెరుగవుతుంది. ఆడవారిలో పీరియడ్స్ సమస్యలు కంట్రోల్ అవుతాయి.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

ఆపానా యోగా ముద్ర వేయడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో వ్యాధులు, ఇన్ ఫెక్షన్లతో పోరాడే శక్తి లభిస్తుంది. శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ బల పడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్