వేసవిలో నోరూరించే మామిడి పండ్లు మార్కెట్లో కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తాయి. బంగినపల్లి, నీలం, చందూరా, రుమానియా, మల్గోవా, చక్కెర కట్టి, గిర్ కేసర్ మామిడి, అంటు మామిడి, చిలక ముక్కు మామిడి.. అబ్బో ఒకటేమిటి రకాల మామిడి పండ్లు ఈ సీజన్‌లో లభిస్తాయి. పులుపు, తీపి రుచితో పసందైన మామిడిపండ్లు కనిపిస్తే తినని వారుండరు. కానీ చాలా మంది మామిడి తొక్క తినేందుకు ఇష్టపడరు. నిజానికి.. పండుకన్నా తొక్కలోనే చాలా పోషకాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అవును.. మామిడి తొక్కలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి తొక్కలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.