శరీర భాగాల్లో కాళ్లు చాలా ముఖ్యం. శరీర బరువును మొత్తం మోసేది కాళ్లే. కాళ్లు బలంగా, దృఢంగా ఉంటేనే ఎంత సేపు అయినా శ్రమించ గలం కానీ కాళ్ల కండరాల్లో బలం లేకుండా ఉంటే ఎలాంటి పనులు కూడా చేయలేం. ముఖ్యంగా బయట షాపింగ్స్‌కి వెళ్లినప్పుడు, ఇంట్లో పూజలు, ఫంక్షన్స్ ఉన్నప్పుడు పని మరింత ఎక్కువగా ఉంటుంది. అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. ఇలా పని అతా అయిపోయాక చాలా మంది నీరసంగా ఉంటారు. కాళ్లు లాగుతున్నాయని చెబుతూ ఉంటారు. ఇందుకు కారణం కాళ్లు బలంగా ఉండాలి. మరి కాళ్లలో బలం ఉండాలంటే కొన్ని రకాల యోగాసనాలు ఎంతో చక్కగా హెల్ప్ చేస్తాయి. మరి ఆ ఆసనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ ఆసనం వేయడం వల్ల కాళ్లు బలంగా, దృఢంగా తయారవుతాయి. కాళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. ఈ ఆసనం వేయడానికి ముందుగా నిటారుగా నిలబడి, ఆపై చేతులను పైకి సాగదీయాలి. ఆ తర్వాత కూర్చున్నట్లుగా మోకాళ్లను ముందుకు పెట్టి ఉంచాలి. ఇలా చేయడం వల్ల తొడ కండరాలు బల పడతాయి. ఇలా ఓ రెండు నిమిషాల వరకు ఉండాలి.
కాళ్లలో బలం పెంచడానికి ఈ ఆసనం కూడా ఎంతో చక్కగా ఉపయోగ పడుతుంది. వృక్షాసనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఆసనం వేయడం వల్ల శరీర సమతుల్యత పెరుగుతుంది. కాళ్లలో దృఢత్వం పెరుగుతుంది. వృక్షాసనం ఎలా వేయాలో చాలా మందికి తెలుసు.
హై లంజ్ ఆసనం వేయడం వల్ల కూడా కాళ్లలోని కండరాలు బలంగా ఉంటాయి. ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. ముందుగా కాళ్లను రెండు దిక్కులా సాగదీసి.. నమస్కారం స్థితిలో చేతులను పైకి ఉంచాలి. ఇప్పుడు వీపును కొద్దిగా వంచి.. ఒక కాలి మోకాలిపై ఉండాలి.
నృత్య భంగిమ ఆసనాన్నే నటరాజసనం అని కూడా పిలుస్తారు. ఈ ఆసనం వేయాలంటే ఒక కాలుపై నిలబడి మరో కాలును వంచి రెండు చేతులతో వెనుక నుంచి పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కాళ్లలో బలం పెరుగుతుంది. నొప్పులు తగ్గుతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..