చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. నాన్ వెజ్ లేకుండా అన్నం తినడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలా ఎంతో గర్వంగా చెబుతూ ఉంటారు. కానీ ఇలా ప్రతి రోజూ నాన్ వెజ్ తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయన్న విషయం తెలీదు. ప్రతి రోజూ నాన్ వెజ్ ఐటెమ్స్ తినే వారిలో ఖచ్చితంగా ఈ వ్యాధి వస్తుందని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. మన ఆహారపు అలవాట్లు.. శరీర ఆరోగ్యం మీదనే కాకుండా.. మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. రోజూ ఫాస్ట్ ఫుడ్స్, లేదా మాంసం తినే వారిలో సాధారణంగా డయాబెటీస్, బీపీ, క్యాన్సర్, ఊబకాయం, కొలెస్ట్రాల్ సమస్యలే కాకుండా మతి మరుపు కూడా వచ్చే అవకాశం ఉందట. ప్రతిరోజూ మాంసం తినే వారిలో వయసు పెరిగే కొద్దీ మతిమరుపుతో బాధ పడతారట. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆస్ట్రేలియాలోని బాండ్ యూనివర్శిటీలో 438 మంది వ్యక్తులపై ఆరోగ్య నిపుణులు పరిశోధన చేశారు. వారి ఆహారపు అలవాట్లతో పాటు అది వారి జ్ఞాపకశక్తిపై ఎలా పని చేస్తుందో తెలుసుకున్నారు. ఈ అధ్యయనంలో ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, మాంసం తినే 108 మందికి అల్జీమర్స్ వ్యాధి వచ్చినట్లు గుర్తించారు. దీని ప్రకారం ఎక్కువగా నాన్ వెజ్ తింటే వయసు పెరిగే కొద్దీ మతిమరుపు రావడం ఖాయం. దీని వలన ఇంట్లో మనుషుల్ని కూడా గుర్తించడం కష్టం అవుతుందని పరిశోధికులు తేల్చారు.
అంతే కాకుండా ప్రతిరోజూ మాంసం తినేవారిలో అధిక బరువు, హై కొలెస్ట్రాల్, డయాబెటీస్, బీపీ, ఫ్యాటీ లివర్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, మరికొంత మందిలో కనిపించాలని వెల్లడిచంారు.
కేవలం పైన చెప్పిన సమస్యలే కాకుండా.. ప్రతి రోజూ నాన్ వెజ్ తినే వారిలో నరాలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయట. రోజూ పండ్లు, కూరలు, గింజలు తినే వారిలో నరాలకు సంబంధించిన సమస్యలు లేవని పరిశోధనలో వెల్లడించారు. మాంసాహార ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే నరాల సమస్యలు వస్తాయని తెలిపారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.