AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ జిల్లాలో ప్రతి మహిళకు శానిటరీ ప్యాడ్స్.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ వినూత్న ఆలోచన

స్వచ్చ సర్వేక్షణ్‌ 2018లో జాతీయస్ధాయిలో మూడో స్ధానంలో, దక్షిణాది రాష్ట్రాల్లో మొదటిస్ధానంలో నిలిచిన తర్వాత పెద్దపల్లి జిల్లా మరో ముందడుగు వేయాలని నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటింటికీ శానిటరీ ప్యాడ్స్ అందే విధంగా ఓ సరికొత్త పథకాన్ని రూపొందించారు. అదే “సబల”. జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన ఈ కొత్త పథకానికి నాంధీ పలికారు. జిల్లాలో ఉన్న ప్రతి మహిళకు రుతుస్రావంపై ఉన్న అపోహలు తొలగించి.. వారి వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడే […]

ఆ జిల్లాలో ప్రతి మహిళకు  శానిటరీ ప్యాడ్స్.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ వినూత్న ఆలోచన
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 06, 2019 | 8:33 PM

Share

స్వచ్చ సర్వేక్షణ్‌ 2018లో జాతీయస్ధాయిలో మూడో స్ధానంలో, దక్షిణాది రాష్ట్రాల్లో మొదటిస్ధానంలో నిలిచిన తర్వాత పెద్దపల్లి జిల్లా మరో ముందడుగు వేయాలని నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటింటికీ శానిటరీ ప్యాడ్స్ అందే విధంగా ఓ సరికొత్త పథకాన్ని రూపొందించారు. అదే “సబల”. జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన ఈ కొత్త పథకానికి నాంధీ పలికారు. జిల్లాలో ఉన్న ప్రతి మహిళకు రుతుస్రావంపై ఉన్న అపోహలు తొలగించి.. వారి వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ఈ పథకాన్ని రూపొందించారు.

Peddapalli district administration targets another milestone

ఇప్పటికీ శానిటరీ నాప్కిన్స్ తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. రూ.45 లక్షల రుణంతో స్వయం సహాయక బృందం ద్వారా వీటి ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. 12 మంది శానిటరీ ప్యాడ్స్ తయారీలో శిక్షణ పొందారు. ఉత్పత్తి కేంద్రం నుంచి అతి తక్కువ ఖర్చుతో, పర్యావరణానికి అనుకూలంగా ఉండే ప్యాడ్స్‌ను తయారు చేస్తున్నారు.

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన “సబల” పథకం ద్వారా మహిళలు, యువతులు, కిషోర బాలికలకు రుతుక్రమంపై అవగాహన కల్పించడంతో పాటు.. వారిలో ఉన్న అపోహలు, భయాలను దూరం చేస్తారు. ప్రతి తన యవన దశకు చేరుకునే సమయంలో కలిగే శారీరక మార్పులను వివరిస్తారు. పూర్వం ఈ విషయాన్ని బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడుకోడానికి ఎంతో భయపడేవారు. కానీ ప్రస్తుతం ధైర్యంగా మాట్లాడుకునే పరిస్థతి వచ్చింది. పెద్దపల్లి జిల్లాలో ప్రారంభించిన “సబల” కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి అక్కడి మహిళతో మాట్లాడి వారికి రుతుక్రమం గురించి వివరించి.. వీరు తయారు చేసిన ప్యాడ్స్‌ ఉపయోగాలు వివరిస్తారు. ఇలా అక్కడ ఆర్డర్ తీసుకుని తిరిగి ప్యాడ్స్‌ను డోర్ డెలివరీ కూడా చేస్తారు. వీరు ఉత్పత్తి చేసిన శానిటరీ ప్యాడ్స్‌ పర్యావరణానికి అనుకూలంగా నీటిలో కరిగిపోయేలా తయారు చేశారు.

Peddapalli district administration targets another milestone: Sanitary napkins to every woman in district

జిల్లాలో ఉన్న ప్రతి మహిళ ఆరోగ్యంపై ఒక మహిళగా జిల్లా కలెక్టర్ దేవసేన ప్రత్యేకంగా ఆలోచించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఆమె చేపట్టిన సబల కార్యక్రమం సక్సెస్ కావడంతో ఇప్పటికే మూత్ర, జననేంద్రియ, గర్భాశయ సమస్యలతో హాస్పిటళ్లకు వెళ్లే మహిళల సంఖ్య సగానికి సగం తగ్గినట్టుగా తెలుస్తోంది.