ఆశ్చర్యం.. మామిడాకులతో ఇలా చేస్తే.. బ్లడ్ షుగర్ మాయం

డయాబెటీస్.. ఈ వ్యాధి ఇప్పుడు సర్వ సాధారమైపోయింది. చక్కెర వ్యాధిగా పిలువబడుతున్న ఈ వ్యాధినుంచి బయటపడేందుకు ఎన్నో మందులు వాడుతూ ఉంటారు. ఎంతో మంది ఖరీదైన వైద్యాన్ని కూడా చేయించుకుంటూ ఉంటారు. డయాబెటీస్‌ను సైలెంట్ కిల్లర్ అనికూడా అంటారు. అందుకే డయాబెటీస్‌పై అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఈ చక్కెరవ్యాధి వయసు మళ్లిన వారిలో మాత్రమే కనిపించేది. కానీ ప్రస్తుతం దానికి వయసుతో సంబంధం లేకుండా చిన్న పిలల్లో సైతం ఈ లక్షణాలు బయటపడుతున్నాయి. సాధాణంగా వంశపారంపర్యంగా కూడా […]

ఆశ్చర్యం.. మామిడాకులతో ఇలా చేస్తే..  బ్లడ్ షుగర్  మాయం
Follow us

| Edited By:

Updated on: Oct 07, 2019 | 4:37 PM

డయాబెటీస్.. ఈ వ్యాధి ఇప్పుడు సర్వ సాధారమైపోయింది. చక్కెర వ్యాధిగా పిలువబడుతున్న ఈ వ్యాధినుంచి బయటపడేందుకు ఎన్నో మందులు వాడుతూ ఉంటారు. ఎంతో మంది ఖరీదైన వైద్యాన్ని కూడా చేయించుకుంటూ ఉంటారు. డయాబెటీస్‌ను సైలెంట్ కిల్లర్ అనికూడా అంటారు. అందుకే డయాబెటీస్‌పై అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఈ చక్కెరవ్యాధి వయసు మళ్లిన వారిలో మాత్రమే కనిపించేది. కానీ ప్రస్తుతం దానికి వయసుతో సంబంధం లేకుండా చిన్న పిలల్లో సైతం ఈ లక్షణాలు బయటపడుతున్నాయి. సాధాణంగా వంశపారంపర్యంగా కూడా డయాబెటీస్ వస్తుందని కూడా వైద్యులు చెబుతున్నారు.

These Leaves Can Lower Your Blood Sugar Levels Quickly And Effectively

శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గించుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మరెన్నో విధాలుగా ఆహారపు అలవాట్లను క్రమబద్దీకరించుకుంటారు. నిజానికి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ తక్కువగా చేయడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉందంటే ఆశ్యర్యపోతారు. అది అందరికీ తెలిసిందే. కానీ దాన్ని ఎలా ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటనేది చాలమందికి తెలియదు. మామిడి ఆకులతో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఆశ్చర్యకర రీతలో తగ్గిపోతాయంటే నమ్మలేం. కానీ ఇది నిజం.

మామిడాకులను ఎలా వాడాలి?

సాధారణంగా మామిడి పళ్లకున్న ప్రత్యేకతే వేరు. కానీ మామిడి ఆకులకు ఆరోగ్యాన్ని ప్రసాదించే గుణాలున్నాయని చాలా మందికి తెలియదు. బ్లడ్ షుగర్‌తో బాధపడుతున్న వారికి మామిడి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. మామిడి ఆకులను వేడినీటిలో బాగా మరిగించి… రాత్రంతా వాటిని నీటిలోనే ఉంచాలి. ఆ తర్వాత ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని తాగితే … కొన్ని నెలల్లోనే బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో మార్పులు చోటు చేసుకుంటాయి.

These Leaves Can Lower Your Blood Sugar Levels Quickly And Effectively

ఎన్నో సమస్యలకు పరిష్కారం మామిడి ఆకులు

గుండెకు రక్తన్ని సరఫరా చేసే నాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతే గుండెజబ్బులు వస్తాయనే విషయం తెలిసిందే. అయితే పైన చెప్పిన విధంగా మామిడి ఆకుల రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల డయాబెటీస్ తగ్గడంతోపాటు, చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ సైతం తగ్గిపోతాయి. మామిడి ఆకుల్లో పెక్టిన్, విటమిన్ సి, ఫైబర్ ఉన్నాయి.

ఇంకా పలు సమస్యలకు ఇదే సరైన మందు

షుగర్, చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ పెరిగితే  శరీరంలో ఇతర అవయవాలకు హాని జరుగుతుంది.  మామిడి ఆకులను పైన చెప్పిన విధంగా ఉపయోగిస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడంతో పాటు  చెడు కొలెస్ట్రాల్‌ను అరికడుతుంది. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల ఇన్‌ఫెక్షలు కూడా రాకుండా ఉంటాయి. అదే విధంగా కిడ్నీ, గాల్ బ్లాడర్లలో రాళ్లు సైతం రాకుండా చేయగలదు.