పిల్లల ముందు దుస్తులు మార్చుకుంటే ఏమౌతుంది..? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..!
పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల ప్రవర్తన అత్యంత కీలకం. వారు చేసే ప్రతి పని పిల్లల మనస్సుపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ప్రైవసీకి సంబంధించిన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. పిల్లల ముందు దుస్తులు మార్చుకోవడం వంటి అలవాట్లు పిల్లల మనస్తత్వంపై ప్రభావం చూపొచ్చు.

తల్లిదండ్రులుగా పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించడం మంచి పాఠాలు చెప్పడం చాలా అవసరం. పిల్లలు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనిస్తూ పెరుగుతారు. పేరెంట్స్ చేసే ప్రతి పని, పిల్లల మనసుపై ప్రభావం చూపుతుంది. కొన్ని విషయాలు పెద్దలు సాదారణంగా చేస్తారు. కానీ అవి పిల్లలకు మేలుకానివిగా మారొచ్చు. పిల్లల ముందు దుస్తులు మార్చుకోవడం కూడా అలాంటి విషయాల్లో ఒకటి. ఇది చిన్న విషయంగా అనిపించినా.. దీని వల్ల పిల్లల మనస్తత్వంపై కొన్ని ప్రభావాలు పడే అవకాశం ఉంటుంది.
పిల్లలు తమ చుట్టూ ఉన్నవారిని గమనిస్తూ పెరుగుతారు. ముఖ్యంగా రెండు సంవత్సరాల వయస్సు నుంచే పిల్లలు చాలా విషయాలను గ్రహించటం మొదలు పెడతారు. పేరెంట్స్ చేసే ప్రతి పనిని గమనించి దానిని అనుసరించే ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రులు పిల్లల ముందు బట్టలు మార్చుకుంటే వారికీ దీనిని సాధారణ విషయం అన్న భావన కలుగుతుంది. అది సరైనదో కాదో అర్థం కాకుండా అదే ప్రవర్తనను అలవర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల ముందు దుస్తులు మార్చుకోకూడదు.
ప్రతి మనిషికి ప్రైవసీ అవసరమే. ఇది పిల్లలకు చిన్నప్పటి నుంచే తెలియజేయాలి. తల్లిదండ్రులు వ్యక్తిగత ప్రదేశంలోనే బట్టలు మార్చుకోవడం వల్ల పిల్లలు కూడా ఇది వ్యక్తిగతమైన పని అనే విషయాన్ని అర్థం చేసుకుంటారు. కానీ అదే పనిగా పిల్లల ముందు దుస్తులు మార్చుకుంటే వారు కూడా ఇది అందరి ముందు చేయదగిన పనే అని భావించవచ్చు. దీని వల్ల బహిరంగ ప్రదేశాల్లో దుస్తులు మార్చుకోవడం లాంటి అనవసరమైన అలవాట్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.
పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారి మనసులో కొత్త ప్రశ్నలు, భావనలు వస్తుంటాయి. తల్లిదండ్రులు పిల్లల ముందు బట్టలు మార్చుకుంటే వారు కొన్ని సందర్భాల్లో అసౌకర్యంగా ఫీలవ్వొచ్చు. దీనివల్ల వారి మానసిక స్థితిపై ప్రభావం పడవచ్చు. కొన్ని విషయాలు ఏకంగా గందరగోళానికి, భయానికి కారణం అవుతాయి. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల అభివృద్ధిలో ఎంత ముఖ్యమో తెలుసుకుని వాటిపై జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
పిల్లలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలను తల్లిదండ్రుల ప్రవర్తన ద్వారానే ఎక్కువగా నేర్చుకుంటారు. అందుకే దుస్తులు మార్చుకోవడం అనేది ప్రత్యేక ప్రదేశంలోనే చేయాలి అని వారికి అర్థమయ్యేలా తల్లిదండ్రులు మెలగాలి. చిన్నప్పటి నుంచే ఈ అలవాటు పెంచితే భవిష్యత్తులో పిల్లలు మరింత ఆచితూచి ప్రవర్తించగలరు.
పిల్లల ఎదుగుదలలో పేరెంట్స్ ప్రవర్తన చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వారు చూపించే ప్రతి చిన్న అభ్యాసం పిల్లల మనస్సులో స్థిరపడుతుంది. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.