Skincare Tips: తమ చర్మం ఆకర్షణీయంగా, మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే తీసుకునే ఆహారం, జీవన శైలి కారణంగా చర్మ సంరక్షణ అనేది పెద్ద సవాలుగా మారిపోయింది. ఈ క్రమంలోనే చాలా మంది చిన్నతనం నుంచే వృద్ధాప్య లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారికి బొప్పాయి చాలా మేలు చేస్తుంది. బొప్పాయిలోని ఐరన్, పొటాషియం, కాల్షియం, జింక్ వంటి పోషకాలతో పాటు యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. ఈ కారణంగా బొప్పాయిని ఫేస్ మాస్క్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలతో పాటు ముడతలు కూడా తొలగిపోతాయి. మరి బొప్పాయిని ఎలా ఉపయోగించాలో తెలుసా..? ఇప్పుడు తెలుసుకుందాం..
కాగా, ముడతలు లేని మెరిసే చర్మం కోసం బొప్పాయి మాస్క్‌తో పాటు నిత్యం తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా తినే ఆహారంలో విటమిన్ ఇ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఇవి చర్మ సంరక్షణలో కీలకంగా పనిచేస్తాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి..