పనీర్ పువ్వులు.. ఎక్కడా దొరికినా వదిలిపెట్టకండి.. బ్లడ్ షుగర్ నియంత్రణకు దివ్యౌషధం..! ఎలా వాడాలంటే..

|

Nov 20, 2023 | 6:21 PM

మధుమేహాన్ని నియంత్రించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఇందులో ఉన్నాయి. ఇది ప్యాంక్రియాస్‌లోని బీటా కణాలను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది, తద్వారా శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు. పనీర్ పువ్వును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య తగ్గుతుంది. అంతే కాదు దీన్ని తీసుకోవడం వల్ల నిద్రలేమి, ఆస్తమా, బీపీ, ఊబకాయం తదితర సమస్యల నుంచి బయటపడొచ్చు.

పనీర్ పువ్వులు.. ఎక్కడా దొరికినా వదిలిపెట్టకండి.. బ్లడ్ షుగర్ నియంత్రణకు దివ్యౌషధం..! ఎలా వాడాలంటే..
Paneer Flower For Diabetes
Follow us on

నేటి కాలంలో అత్యంత తీవ్రమైన సమస్యల్లో మధుమేహం ఒకటి. ఇంతకుముందు ఈ వ్యాధి వృద్ధులలో మాత్రమే ఎక్కువగా కనిపించేది. కానీ నేటి అనారోగ్య కరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా యువత, పిల్లలు కూడా డయాబెటిక్‌ బారిన పడుతున్నారు. మధుమేహం జీవనశైలి వ్యాధి. పూర్తిగా నయం చేయలేం. అయితే, మందులతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు. అంతేకాదు కొన్ని ఆయుర్వేద హోం రెమెడీస్ సహాయంతో మధుమేహాన్ని కూడా మీ కంట్రోల్‌లో ఉంచవచ్చు. డయాబెటిక్ రోగులకు వరంలాంటి అనేక ఆయుర్వేద మందులు ఉన్నాయి. అటువంటి ఔషధాలలో ఒకటి పనీర్ పువ్వులు. దీనిని పనీర్ దోడా, ఇండియన్ అని కూడా అంటారు. దీన్ని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ ను సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి మధుమేహాన్ని నియంత్రించడంలో పనీర్ పువ్వులు ఎలా ఉపయోగపడతాయో..వాటిని ఎలా తినాలో తెలుసుకుందాం?

మధుమేహానికి పనీర్ పువ్వు..

పనీర్ పువ్వులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చిన్న పువ్వు. కానీ, రుచిలో తీపి, ఉప్పగా ఉంటుంది. ఇది ఉపశమన, మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. ముఖ్యంగా మధుమేహాన్ని నియంత్రించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఇందులో ఉన్నాయి. ఇది ప్యాంక్రియాస్‌లోని బీటా కణాలను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది, తద్వారా శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు. పనీర్ పువ్వును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య తగ్గుతుంది. అంతే కాదు దీన్ని తీసుకోవడం వల్ల నిద్రలేమి, ఆస్తమా, బీపీ, ఊబకాయం తదితర సమస్యల నుంచి బయటపడొచ్చు.

ఇవి కూడా చదవండి

డయాబెటిస్‌లో పనీర్ పువ్వును ఎలా ఉపయోగించాలి?

ముందుగా 6-7 పనీర్ పూలను తీసుకుని ఒక గ్లాసు నీటిలో 2 గంటల పాటు నానబెట్టాలి. మీకు కావాలంటే, మీరు వాటిని రాత్రంతా నానబెట్టవచ్చు. ఇప్పుడు పువ్వులను నీటితో ఒక గిన్నెలో వేసి మరిగించాలి. తర్వాత నీటిని ఫిల్టర్ చేసి గోరువెచ్చగా ఉండగానే..ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ వాటర్ తాగవచ్చు. దీన్ని రెగ్యులర్‌గా వినియోగించటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు ప్రతి ఆయుర్వేద ఔషధం, మూలికా దుకాణంలో పనీర్ పూలను కొనుక్కోవచ్చు. ప్రస్తుతం ఈ పూలు ఆన్‌లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. పనీర్‌ పూల పేరుతో ఆన్‌లైన్‌లో సులభంగా కొనుగోలు చేయవచ్చు.

* మధుమేహాన్ని నియంత్రించడానికి ఇతర చిట్కాలు..

– వీలైనంత వరకు తీపి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

– ఎప్పటికప్పుడు మీ బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ని చెక్‌ చేసుకోవటం మంచిది.

– మధుమేహం బాధితులు తమ బరువును అదుపులో ఉంచుకోవటం ఉత్తమం.

– రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్‌, తేలికపాటి వ్యాయామం చేయండి. ఇది మీ శరీరం గ్లూకోజ్‌ను శక్తిగా ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెరను పెంచదు.

– మీరు డయాబెటిస్ కోసం పనీర్ పూలను ఉపయోగిస్తున్నట్టయితే..దాంతో పాటు మీరు సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యం. అధిక మొత్తంలో ప్రాసెస్ చేసిన చక్కెరను కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మానుకోండి. అయితే, డయాబెటిస్‌ నియంత్రణ కోసం ఈ మూలికను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించండి.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..